పారిశుధ్య యంత్రాలను ఇవ్వండి: ఒవైసీ | please give cleaning mechines | Sakshi
Sakshi News home page

పారిశుధ్య యంత్రాలను ఇవ్వండి: ఒవైసీ

May 15 2015 1:44 AM | Updated on Sep 3 2017 2:02 AM

పారిశుధ్య యంత్రాలను ఇవ్వండి: ఒవైసీ

పారిశుధ్య యంత్రాలను ఇవ్వండి: ఒవైసీ

హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు కావాల్సిన పారిశుధ్య యంత్రాలను అందజేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు ఎంఐఎం నేత అసదుద్ధీన్ ఒవైసీ తెలిపారు

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు కావాల్సిన పారిశుధ్య యంత్రాలను అందజేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు ఎంఐఎం నేత అసదుద్ధీన్ ఒవైసీ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలంతా పాల్గొంటారని చెప్పారు. గురువారం సీఎం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ సమీక్షలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి పాల్గొన్న అసదుద్ధీన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. పాతబస్తీలో పారిశుధ్య నిర్వహణకు 100 రిక్షాలు, 100 చెత్త బుట్టలను వెంటనే ఇవ్వాలని సీఎంను కోరామన్నారు.

 మక్కామసీదు పేలుళ్ల నిందితుల బెయిల్ రద్దు చేయాలి...
  2008 మక్కా మసీదు పేలుళ్ల నిందితులు దేవేందర్, లోకేష్ బెయిల్‌ను రద్దు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అసదుద్ధీన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుల బెయిల్‌పై కేంద్రం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కూడా చేయలేదంటూ తప్పుపట్టారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement