breaking news
AITS
-
ఉత్సాహంగా జూడో ఎంపికలు
రాజంపేట: రాజంపేట ఏఐటీఎస్‌లో శనివారం జూడో జట్టు ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. పోజేఎన్టీయూ (అనంతపురం) పరిధిలోని వైఎస్సార్‌జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా ఎంపికైన పురుష, మహిళ జట్లు నవంబరు మొదటివారంలో హర్యానా రాష్ట్రంలో జరిగే జాతీయ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొననున్నారు. జేఎన్టీయూ క్రీడా కార్యదర్శి జోజిరెడ్డి మాట్లాడుతూ యూనవర్సిటీ స్థాయికి ఎంపికైన విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి యూనవర్సిటీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. జూడో జట్టు ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ నారాయణ, రాష్ట్ర జూడో సెక్రటరీ కె.బాబు, ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పాయల్లారెడ్డి మాట్లాడుతూ నేటి తరం యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఒలంపిక్స్ పతకం సాధించిన సింధూను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పీడీ నాగముని, వివిధ కళాశాల జూడో పీడీలు పాల్గొన్నారు. బాలుర జట్టు.. జూడో బాలుర జట్టు: ఎస్.గాదిలింగ, జి.వన్నూరుస్వామి , ఎస్.చాంద్‌బాషా, బీ.ఉస్మాన్దాదా, పీ.యుగంధర్, పీ.ఆకాష్ , ఎం.హర్షవర్ధన్ , శోబిన్జెకారియా బాలికల జట్టు.. జూడో బాలికల జట్టు: ఆర్వీ జ్ఞానేశ్వరి. ఎం.నందిని, బీ.బుజ్జి , బీవీఎస్ ప్రణతి, బీ.సుమతి, టీ.సుమలత, కె.మణిదీపిక, ఎ.తనూజ ఎంపికయ్యారు. -
పోటీ ప్రపంచంలో ఐఓటీకి ప్రత్యేక స్థానం
రాజంపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్) ప్రత్యేక స్థానం సంతరించుకుందని వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ డా.రవికిషోర్ పేర్కొన్నారు. సోమవారం ఏఐటీఎస్ (అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల)లో ఐఓటీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఓటీ ద్వారా ఆసుపత్రిలో అందే వైద్యసేవలు తెలుసుకోవచ్చన్నారు. వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ డా.బీ.లక్ష్మీ మాట్లాడుతూ ఐఓటీ పరిజ్ఞానంపై పట్టు సాధించగలిగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. సదస్సు నిర్వహణాధికారి డా.సుబ్రమణ్యం మాట్లాడుతూ ఐఓటీ టెక్నాలజీ వివిధ కోణాలలో విస్తరించిందన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా వస్తువుల వినియోగాన్ని సులభతరంగా తెలుసుకోవచ్చన్నారు. డైరక్టరు ప్రభాకరరావు, కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఐఓటీ సాంకేతిక విద్యకు అనుగుణంగా సిలబస్‌ను ఆకలింపు చేసుకోవాలన్నారు. ఐఓటీపై దృష్టి సారిస్తే మంచి ప్రాజెక్టులను తయారు చేసుకోవచ్చునన్నారు. ఏఐటీఎస్ ఈడీ చొప్పా అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ ఐటీ సమాజం చుట్టూ తిరుగుతోందన్నారు. మారుతున్న సమాజంలో ఐఓటీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు రోజురోజుకు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పాయల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.