Airlander 10
-
ఎయిర్‌లాండర్ ఎగిరితే.. పెద్ద ఓడ గాల్లో తేలిపోతున్నట్లే!
ఇది అలాంటిలాంటి విమానం కాదు, పెద్ద ఓడలాంటి విమానం. గాలిలో ఇది ఎగురుతుంటే, పెద్ద ఓడ నింగిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌లాండర్ ఈ భారీ విమానానికి రూపకల్పన చేసింది. బ్రిటన్‌కు చెందిన విమానాల డిజైనింగ్ సంస్థ ‘డిజైన్–క్యూ’ సహాయంతో రూపొందించిన ఈ విమానం పేరు ‘ఎయిర్‌లాండర్–10’. ఇందులో లగ్జరీ నౌకల్లో ఉండే సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేయడం విశేషం. ఇదీ చదవండి: ఈ ఓడ ఏ ఇంధనంతో నడుస్తుందో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు! విశాలమైన ఈ విమానంలో ప్రయాణికుల కోసం ఎనిమిది బెడ్రూమ్లు, బాత్రూమ్లు, షవర్లు, సువిశాలమైన లివింగ్ ఏరియా, సీటింగ్ ఏరియా, వైఫై సౌకర్యం, ఇతర వినోద సౌకర్యాలు, బార్ వంటి విలాసాలు ఈ విమానం ప్రత్యేకత. సాధారణ విమానాలతో పోలిస్తే దీని వేగం కాస్త తక్కువే! సాధారణ విమానాల గరిష్ఠ వేగం గంటకు 500 మైళ్లకు పైగా ఉంటే, దీని గరిష్ఠవేగం గంటకు 100 మైళ్లు మాత్రమే! ఇది 2026లో తన తొలి ప్రయాణం ప్రారంభించనుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ప్రపంచ అతిపెద్ద విమానం క్రాష్‌ల్యాండ్!
-
ప్రపంచ అతిపెద్ద విమానం క్రాష్‌ల్యాండ్!
అది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. 320 అడుగుల పొడవు, రూ. 222 కోట్ల (25మిలియన్ పౌండ్ల) ఖర్చుతో రూపొందిన ఎయిర్‌ల్యాండర్-10 గాలిలోకి ఎగిరిన ఏడురోజులకే క్రాష్ ల్యాండ్ అయింది. 'ఫ్లయింగ్ బమ్' అని ముద్దుగా పిలుచుకునే ఈ విమానం బుధవారం ల్యాండ్ అయ్యే సమయంలో సమీపంలో ఉన్న ఓ టెలిగ్రాఫ్ స్తంభాన్ని ఢీకొట్టింది. విమానం సవ్యంగా ల్యాండ్ కాకపోవడంతో కాక్‌పిట్ ధ్వంసమైంది. బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, విమానం చాలా నెమ్మదిగా దిగుతూ ఉండటం వల్ల క్రాష్‌ల్యాండ్ అయినా పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే, క్రాష్‌ల్యాండ్ అయ్యే సమయంలో భూమి బద్దలైనట్టు అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంత విమానం, కొంత ఎయిర్‌షిప్ అయిన ఎయిర్‌ల్యాండర్-10 విమానం గత బుధవారం మధ్య ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరిన సంగతి తెలిసిందే. పదిటన్నుల బరువు మోయగల ఈ అతిపెద్ద విమానాన్ని బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్ఏవీ) రూపొందించింది. ఈ విమానం బ్రిటన్‌లోనే అతిగొప్ప ఆవిష్కరణగా రూపకర్తలు గొప్పలు చెప్పుకొన్నారు. -
ప్రపంచంలోనే అతి పే..ద్ద విమానం గాలిలో..!
లండన్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎట్టకేలకు బుధవారం గాలిలోకి ఎగిరింది. నాలుగురోజుల కిందటే ఈ విమానాన్ని తొలిసారి నడిపేందుకు ప్రయత్నించినా.. సాంకేతిక కారణాల వల్ల సాధ్యపడలేదు. కొంత విమానం, కొంత ఎయిర్‌షిప్ అయిన ఎయిర్‌ల్యాండర్-10 విమానం బుధవారం మధ్య ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. ప్రపంచంలోని అతిపెద్ద విమానమైన ఎయిర్ ల్యాండర్-10 తొలిసారి ఎగురుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి.. దానిని వీక్షించారు. 85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్‌లో ఇదే ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్‌షిప్ ఆర్101 ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఎయిర్ షిప్‌లను రూపొందించడం ఆపేశారు. తాజాగా 302 అడుగుల పొడవున్న ఎయిర్‌ల్యాండర్-10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్ఏవీ) రూపొందించింది. -
బుడగ విమానం
విమానమెక్కాలంటే... అది ఉండే చోటుకెళ్లాలి. ఆ తరువాత విమానం రన్‌వేపై పరుగులు పెట్టాలి. పెకైగరాలి. ఇదీ తంతు. ఫొటోలో కనిపిస్తోందే... ఇదీ విమానమే. కాకపోతే రన్‌వే అవసరం లేదు! అంతేకాదు, ఎయిర్‌పోర్టుల అవసరమే లేకుండా ఎక్కడపడితే అక్కడ ఆఖరుకు నీటిపైనైనా, మంచు పర్వతాల పైనైనా ల్యాండైపోతుంది. ఇంధనమన్నది నింపుకోకుండా ఏకంగా రెండు వారాలపాటు గాల్లో ఎగురుతూనే ఉంటుంది. అన్నట్టు ఈ విమానం పేరు చెప్పలేదు కదూ... ‘ఎయిర్‌ల్యాండర్ 10’. బ్రిటన్‌లోని హైబ్రిడ్ ఎయిర్వెహికల్స్ సంస్థ దీనిని తయారు చేసింది. దీని ప్రత్యేకతల్లో పైన చెప్పినవి కొన్నే. నిజానికి ఇది పూర్తిస్థాయి విమానం కూడా కాదు. గాలికంటే తేలికగా ఉన్న హీలియం వాయువు నింపిన బుడగ. అడుగున మనుషులు ప్రయాణించేందుకైనా లేదా సరుకులు రవాణా చేసేందుకైనా ఏర్పాట్లు ఉంటాయి. ఎయిర్‌ల్యాండర్ 10 దాదాపు పదిటన్నుల బరువు మోయగలదు. దీని సైజు కూడా ఇందుకు తగ్గట్టుగానే ఉంటుంది. దాదాపు 300 అడుగుల పొడవు, 112 అడుగుల వెడల్పు ఉండే ఎయిర్‌ల్యాండర్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో 2500 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదు. దీంట్లో ఎంత హీలియం నింపారో తెలుసా? పదమూడు లక్షల ఘనపుటడుగులు! ఇంకోలా చెప్పాలంటే 15 ఒలింపిక్ సైజు స్విమ్మింగ్‌పూల్స్‌లో పట్టే నీళ్లంతన్నమాట! మామూలు విమానాలతో పోలిస్తే అతితక్కువ ఇంధనం వాడుతుంది. అలాగే ఏ మాత్రం శబ్దం కూడా చేయదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా? నిర్మాణం పూర్తి చేసుకుని వారం రోజుల క్రితమే ఇది తన తొలి పరీక్ష పూర్తి చేసుకుంది. త్వరలో వాణిజ్యస్థాయిలో కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. ఓహ్! ఇంకో విషయం. 1930 ప్రాంతంలో జర్మనీ ఇలాంటి విమానాలనే జెప్పెలిన్స్ పేరుతో తయారు చేసింది. కాకపోతే ఒక ప్రమాదంలో దాదాపు 35 మంది చనిపోవడంతో గాలిబుడగల ద్వారా విమాన ప్రయాణమన్న కాన్సెప్ట్ మరుగున పడిపోయింది. ఎయిర్‌ల్యాండర్ 10తో ఆ పరిస్థితి రిపీట్ కాకపోవచ్చని అంచనా.