breaking news
air gun blast
-
ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి.. కేసులో ట్విస్ట్.. జరిగింది ఇదే!
సాక్షి, సంగారెడ్డి: ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతి చెందిన కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. చిన్నారి మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరమీదకొచ్చింది. ఇప్పటి వరకు నాలుగేళ్ల చిన్నారి సాన్వి ఎయిర్ గన్‌తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలడంతో ఆమె కణతలోకి గుండు దూసుకుపోయి చనిపోయిందని అనుకున్నారు. అయితే ఎయిర్ గన్ పేలుడులో చిన్నారిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగానే దగ్గరి నుంచి కాల్చినట్టు పోలీసులు గుర్తించారు. పామ్‌హౌజ్‌లో 17 ఏళ్ల యువకుడు గన్‌తో ఆడుతూ ఫైర్ చేయగా అటుగా వెళ్తున్న బాలిక సాన్వీకి పిల్లిట్ తగిలినట్లు పోలీసులు తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలి శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు మృతిచెందిన చిన్నారి మృతదేహం ఇంకా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలోనే ఉంది. గురువారం ఆసుపత్రిలో మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసులోని నిందితులను పఠాన్ చెరు పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఎయిర్ గన్ ఘటనపై డీఎస్పీ భీమ్ రెడ్డి వివరాలు వెల్లడించారు. చదవండి: రియల్టర్ల జంట హత్య: ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు ‘మార్చి 16న 12 గంటల సమయంలో జిన్నారం పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. ప్రసాద్ ఫామ్ హౌస్‌లో నాగరాజు అనే వ్యక్తి వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. ఆన్ లైన్లో రూ. 26 వేలకు ఎయిర్ గన్ ప్రసాద్ కొనుగోలు చేసి నిర్లక్ష్యంగా తన ఫామ్‌హౌజ్‌లో వాచ్మెన్ గదిలో ఉంచాడు. ఎయిర్ గన్‌కు లైసెన్స్ అవసరం లేదు. నాగరాజు ఇంటికీ బంధువులు వచ్చారు అందులో 17 ఏళ్ళ యువకుడు గన్‌తో అడుతూ ఫైర్ చేశాడు. దీంతో అటు వైపుగా వస్తున్న 4 ఏళ్ళ బాలికకు పిల్లెట్ తగిలింది. పిల్లెట్ కణతి మీద తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. 17 ఏళ్ళ బాలుడిని, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నాం. 109, 176 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం’ అని డీఎస్పీ తెలిపారు. -
సంగారెడ్డిలో ఎయిర్ గన్ పేలి నాలుగేళ్ల చిన్నారి మృతి
సాక్షి, సంగారెడ్డి(మెదక్): ఎయిర్ గన్ పేలి చిన్నారి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఎయిర్ గన్ పేలింది. పిల్లలు గన్‌తో ఆడుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంలో శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప గాయపడింది. దీంతో బాలికను హుటాహుటినా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్ లేదా.. నో ప్రాబ్లమ్! అయితే చికిత్స పొందుతూ తెల్లవారు జామున 2 గంటలకు మృతి చెందింది. పాప మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా ఈ ఘటన మంగళవారం రాత్రి పది గంటల సమయంలో జరిగినట్లు పఠాన్ చెరువు డీఎస్పీ భీం రెడ్డి తెలిపారు. ప్రసాద్ అనే వ్యక్తి ఫామ్ హౌజ్‌లో సంఘటన జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -
ఎయిర్‌గన్‌తో భార్యపై కాల్పులు
-
ఎయిర్‌గన్‌తో భార్యపై కాల్పులు
మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో గౌడవెల్లి గ్రామంలోని ఓ ఫామ్ హౌస్‌లో సింగిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎయిర్‌గన్‌తో భార్యపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డి భార్య శిరీషను బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మొదట ప్రమాదవశాత్తూ ఎయిర్‌గన్ పేలినట్టు వార్తలు వచ్చాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి రెండు ఎయిర్ గన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సాయిశేఖర్, సీఐ శంకర్ యాదవ్‌లు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.