
ఎయిర్‌గన్‌తో భార్యపై కాల్పులు
మేడ్చల్ జిల్లాలో గౌడవెల్లి గ్రామంలోని ఓ ఫామ్ హౌస్‌లో సింగిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎయిర్‌గన్‌తో భార్యపై కాల్పులు జరిపాడు.
మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో గౌడవెల్లి గ్రామంలోని ఓ ఫామ్ హౌస్‌లో సింగిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎయిర్‌గన్‌తో భార్యపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డి భార్య శిరీషను బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు.
సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మొదట ప్రమాదవశాత్తూ ఎయిర్‌గన్ పేలినట్టు వార్తలు వచ్చాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి రెండు ఎయిర్ గన్‌లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సాయిశేఖర్, సీఐ శంకర్ యాదవ్‌లు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.