breaking news
adnoc
-
హార్మూజ్‌లో రెండు యూఏఈ ట్యాంకర్లపై దాడి
దుబాయ్: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ చమురు నౌకలపై ఇరాన్ దాడికి పాల్పడిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) శుక్రవారం ఆరోపించింది. యూఏఈ ప్రభుత్వ సంస్థ అడ్నాక్‌కు చెందిన ఈ రెండు నౌకలపై గురువారం సాయంత్రం హార్మూజ్‌లో ఉండగా దాడి జరిగిందని పేర్కొంది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని, ఎటువంటి తీవ్రమైన నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ నౌకలపై డ్రోన్ దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ విభాగం ధ్రువీకరించింది. దాడులకు ఇరానే కారణమని యూఏఈ ఆరోపించింది. ఇటువంటి చర్యలు ఐక్యరాజ్యసమితి స్వేచ్ఛా నౌకాయాన సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడటం సముద్రపు దొంగతనాలుగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. దీనిపై ఇరాన్ స్పందించలేదు. -
వ్యూహాత్మక గిడ్డంగుల్లో చమురు నిల్వకు ‘అడ్నాక్’ ఓకే..
న్యూఢిల్లీ: వైజాగ్, మంగళూరు తదితర ప్రాం తాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న వ్యూహాత్మక భూగర్భ స్టోరేజీ కేంద్రాల్లో చమురును నిల్వ చేసుకునేందుకు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) ఆసక్తిగా ఉంది. ఇందులో మూడింట రెండొంతుల చమురును భారత్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు అడ్నాక్ అంగీకరించినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మంగళూరులో 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉండే మంగళూరు స్టోరేజీలో సగభాగం తీసుకునేందుకు అడ్నాక్ ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇందులో నిల్వ చేసుకునే 0.75 మిలియన్ టన్నులు (సుమారు 6 మిలియన్ బ్యారెళ్లు) చమురులో 0.5 మిలియన్ టన్నుల పరిమాణాన్ని భారత్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ గిడ్డంగిని అడ్నాక్ చమురు ట్రేడింగ్‌కు ఉపయోగించుకోనుంది. 1.33 మిలియన్ టన్నుల వైజాగ్, 2.5 మిలియన్ టన్నుల పాదూరు, 1.5 మిలియన్ టన్నుల మంగళూరు గిడ్డంగుల్లో నిల్వ చేసే చమురు పది రోజుల పాటు భారత్ అవసరాలకు సరిపోతుంది. అంతర్జాతీయంగా చమురు ధరల భారీ హెచ్చుతగ్గుల నుంచి ఊరట కోసం భారత్ ఈ గిడ్డంగులను నిర్మిస్తోంది.


