Adiseshu
-
ఒక్క ఫోన్ చేసినా.. ఇంత అనర్థం జరిగేది కాదు
కాకినాడ రూరల్: ‘‘జరిగిన ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాం. మా కుటుంబంలో అందరూ విద్యావంతులు. పెదనాన్న కొడుకు చంద్రకిశోర్ (37)ఎంబీఏ, ఎంకామ్ చదివాడు. చాలా కష్టపడి పైకి వచ్చాడు. 2014లో ఓఎన్జీసీలో ఉద్యోగంలో చేరాడు. ఒకటో తరగతి చదువుతున్న జోషిత్(7), యూకేజీ చదువుతున్న నిఖిల్(6)ను ఇటీవలే స్కూల్ మార్చాడు. ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నట్టు చెప్పలేదు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు’’ అని కాకినాడలో ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రకిశోర్ సోదరుడు, తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి ఆదిశేషు వాపోయారు. తాడేపల్లిగూడెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. చంద్రకు 2017లో రాజమహేంద్రవరానికి చెందిన తనూజతో వివాహమైందని, ఆమె ఎంబీఏ చదివారని తెలిపారు. కాగా, తమ సంస్థలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న చంద్రకిశోర్ చాలా మంచి వ్యక్తి అని, ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, పిల్లలతో పాటు అతడూ చనిపోవడం బాధాకరమని ఓఎన్జీసీ, కాకినాడ హెచ్ఆర్ హెడ్ సునీల్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కలకలం రేపిన ఘటన.. ఇద్దరు కుమారులను కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి వస్త్రం కట్టి నీటి బకెట్లో ముంచి ప్రాణం తీసి, ఆపై తానూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చంద్రకిశోర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. చంద్రకిశోర్ కాకినాడ రూరల్ వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఇద్దరు పిల్లలతో కాకినాడ తోట సుబ్బారావు నగర్లో ఉంటున్నాడు. హోలీ పండగ కోసం ఓఎన్జీసీ కార్యాలయానికి భార్య, పిల్లలను తీసుకెళ్లిన అతడు.. భార్యను అక్కడే ఉంచి బట్టలు కుట్టించేందుకు అంటూ పిల్లలను బయటకు తీసుకొచ్చాడు. కాగా, కాకినాడలో పేరున్న పాఠశాలలో ఇద్దరు పిల్లలను ఏటా రూ.1.50 లక్షల ఫీజుతో చేర్పించాడు. బాగా చదవడం లేదని తిరిగి తక్కువ ఫీజున్న స్కూల్‌కు మార్పించాడు. పిల్లల చదువుపై అతడ బెంగ పెట్టుకున్నట్టు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. -
ఆదిశేషు ఆస్తులు అటాచ్
విజయవాడ : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఆస్తులును గురువారం ఏసీబీ అటాచ్ చేసింది. ప్రభుత్వం ఆయన్ని విధుల నుంచి సస్పెన్షన్ చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో విధులు నిర్వహిస్తున్న ఆదిశేషు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఆయన నివాసంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు జిల్లాలోని బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆదిశేషు సుమారు రూ. 130 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో అతడి అస్తులను ఏసీబీ అటాచ్ చేసింది. అలాగే విధుల నుంచి తొలగించింది. -
ఆదిశేషును విచారిస్తున్న ఏసీబీ
విజయవాడ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం. ఆదిశేషును ఏసీబీ అధికారులు గురువారం విజయవాడలో విచారిస్తున్నారు. అందులోభాగంగా అతడికి చెందిన బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అందుకోసం రంగం సిద్ధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మద్యం డిపోలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ మిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. ఆదిశేషు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడలోని ఆయన నివాసంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేశారు. అలాగే గుంటూరు, ఏలూరులోని బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ. 80 కోట్ల ఆస్తులు ఆదిశేషు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అందులోభాగంగా ఏసీబీ అధికారులు ఎం.ఆదిశేషును ప్రశ్నిస్తున్నారు. -
ఎక్సైజ్ ఏసీ సోదరుడి ఇంట్లో ఏసీబీ సోదాలు
ఏలూరు అర్బన్ : చాగల్లు మద్యం డిపోలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.ఆదిశేషుపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో స్థానిక బడేటివారి వీధిలో నివాసముంటున్న ఆయన సోదరుడు మామిళ్లపల్లి పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఆదిశేషు చాగల్లు డిపోలో బాధ్యతలు స్వీకరించక ముందు గుంటూరులో పనిచేసేవారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సుమారు 8 నెలలుగా ఆయన కుంటుంబం, బంధువులు, స్నేహితులపై ప్రత్యేక నిఘా ఉంచిన ఏసీబీ సెంట్రల్ సెల్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఆయన బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన ఆదిశేషు బంధువులు ఏలూరులో నివాసం ఉన్నారని గుర్తించిన అధికారులు పార్థసారథి ఇంట్లో సోదాలు చేశారు. నిందితునికి బినామీగా భావిస్తున్న ఆయన ఇంట్లో స్థిరాస్థులకు సంబంధించిన దస్తావేజులు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. చాగల్లు డిపోలోనూ.. చాగల్లు: చాగల్లులోని మద్యం డిపోలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒంగోలు ఏసీబీ సీఐ ప్రతాప్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము వచ్చిన బందం మధ్యాహ్నం రెండు గంటల వరకు సోదాలు చేసింది. విజయవాడలో నివసిస్తున్న అదిశేషు ఇంట్లో, అతని బందువులు ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. చాగల్లు డిపోలో మధ్యం నిల్వలు, ఆయన కార్యాలయూన్ని ఏసీబీ అధికారులు క్షుణంగా తనిఖీ చేశారు. డిపో సిబ్బందిని, హమాలీలను బయటికి పంపించేశారు. సోదాలతో డిపో నుంచి మద్యం కేసులు డెలివరీ నిలిచిపోరుుంది. దీంతో మద్యం వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. సీఐ ప్రతాప్ మాట్లాడుతూ అదిశేషుకు విజయవాడలో ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో అతనిపై కేసు నమోదైందని చెప్పారు. చాగల్లు డిపోలో చేసిన తనిఖీల్లో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభించలేదని చెప్పారు. అదిశేషు మూడు నెలల క్రితం బదిలీపై చాగల్లు డిపోకు వచ్చారు. -
ఆదిశేషు అక్రమాస్తులు రూ.100 కోట్లు!
విజయవాడ : విజయవాడలోని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఇంటిపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదిశేషుకు చెందిన దాదాపు రూ. 100 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రానికి ఈ తనిఖీలు పూర్తయి... మరిన్నీ ఆస్తులు బహిర్గతమయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం చాగల్లు బెవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న ఆదిశేషు ఆదాయానికి మించి ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆదిశేషుతోపాటు అతడి బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడి చేశారు.