breaking news
Act of War
-
భారత్‌ది యుద్ధ చర్యే: పాక్
ఉడీ దాడి తర్వాత భారత్ తెస్తున్న ఒత్తిడిని తట్టుకోలేని పాకిస్థాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా పాక్ రాయబారి యుద్ధానికి సిద్దమేనంటూ ప్రకటన చేశారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంటే దాన్ని యుద్ధ చర్యగా భావిస్తామని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల చీఫ్ సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. నీటి పంపకాలపై సంప్రదింపులకు భారత్ నో చెప్పడంతో అజీజ్ పై విధంగా స్పందించారు. ఇప్పటికే ఒప్పందం రద్దు విషయాన్ని ఐరాస, అంతర్జాతీయ న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళతామని పాక్ భారత్ ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిగా 56ఏళ్ల క్రితం చేసుకున్న ఈ ఒప్పందం యుద్ధాల సమయంలోనూ రద్దుకాలేదని అజీజ్ పాక్ పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇండియా తనంతట తాను ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదని చెప్పారు. జమ్మూ, కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని యూఎన్ జనరల్ అసెంబ్లీలో పేర్కొనడాన్ని పాక్ జాతీయ అసెంబ్లీ ఖండించింది. ఎప్పటిలానే కేవలం శాంతియుత చర్చలతోనే సత్సంబంధాలు ఏర్పడతాయని కపట వ్యాఖ్యలు చేసింది. సింధు నదీ జలాలపై భారత్ తీసుకున్న నిర్ణయం ఆర్ధిక ఉగ్రవాదమని పాకిస్తాన్ సింధు నదీ జలాల మాజీ కమిషనర్ జమాత్ అలీ షా విమర్శించారు. ఒప్పందం రద్దయితే భారత్ జీలం, చినాబ్ నదులపై పెద్ద ఎత్తున కొత్త డ్యామ్ ల నిర్మాణం చేపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
'మా దేశంపై యుద్దానికి దిగారు'
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన దాడులను యుద్దానికి తెగబడ్డ చర్యలుగా పరిగణిస్తున్నట్లు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. ఉగ్రవాదుల చర్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. పారిస్ నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఐఎస్ఎస్ జరిపిన దాడులను స్వేచ్ఛాయుత దేశమైన ఫ్రాన్స్ పై ఉగ్రవాదులు చేసిన యుద్ద చర్యలుగా ఆయన అభిప్రాయపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా సారథ్యంలో మిత్రపక్షంగా ఉంటూ సిరియా, ఇరాక్ దేశాల్లో చొరబడ్డ ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లపై వాయు బలగాల ద్వారా దాడులు జరుపుతోంది. ఈ నెల చివర్లో ప్రపంచ వాతావరణ మార్పు సదస్సులో ఉగ్రదాడులపై హై అలర్ట్ ప్రకటించనున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడటం గమనార్హం. 2004లో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో 191 మందిని బలిగొన్న ఘటన తర్వాత యూరప్‌లో చోటుచేసుకున్న అతి పెద్ద సంఘటన ఇది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుళ్ల ఘటనలో సుమారు 120 మంది మృత్యువాతపడ్డ విషయం అందరికీ విదితమే.