breaking news
Acrobat
-
లైవ్‌లో భర్తతో గాల్లో ఫీట్లు అంతలోనే..
భార్యభర్తలిద్దరూ లైవ్‌లో జిమ్నాస్టిక్ చేస్తుండగా అనూహ్య ఘటన చోటు చేసకుంది. ఎన్నో ఏళ్లగా కలిసి ఇలాంటి ప్రదర్శనలిచ్చారు. అలాంటిది అనుకోకుండా ఘెర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే జరగడంతో ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు కమమ్ముకున్నాయి. అసలేం జరిగిందంటే.. చైనీస్ అక్రోబాట్ జిమ్నాస్టిక్ ప్రదర్శనలో భాగంగా ఒక స్టంట్ చేస్తున్నారు. లైవ్‌లో ఎప్పుడూ రోటిన్‌గా తన భాగస్వామితో చేసే స్టంట్ చేస్తోంది. ఈ మేరకు ఆమె సెంట్రల్ అన్హుయ్ ప్రావిన్స్‌లోని సుజౌ నగరంలో ఫ్లయింగ్-ట్రాపెజ్ ప్రదర్శనలో భాగంగా లైవ్‌లో విన్యాసం చేస్తుండగా ..అనుహ్యంగా 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయింది. ఆమె భాగస్వామి కాళ్లతో ఆమెను క్యాచ్ చేయడంలో విఫలమవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో హుటాహుటినా ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని సమాచారం. ఆ భార్యభర్తలిద్దరూ ఇలాంటి ప్రదర్శనలు చాలా సార్లు ఇచ్చారని, పైగా ఎప్పుడూ కూడా బెల్ట్‌లు లేకుండానే చేశారని చెబుతున్నారు స్థానికులు. ఐతే ఈ ఘటన జరిగే ముందు ఇద్దరు గొడవపడ్డారని, ఆ మహిళను సేఫ్టి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పినా.. నిరాకరించిందని సమాచారం. ఐతే ఆమె భర్త మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించాడు. తాము ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవాళ్లమని చెబుతున్నాడు. ఈ మేరకు అధికారలు కేసు నమోదు చేసుకుని ఆ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వీడియో కోసం: ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: ఆ విలువ లేని డిగ్రీలే భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయ్!) -
ఆ ఫీట్ చూస్తే మనకే ఫిట్స్ వస్తాయి...
కాలిఫోర్నియా: సాహసమే ఊపిరిగా బతికేవాళ్లు తాడు మీద బ్యాలెన్స్‌గా నడవడం, దానిపై యోగాలాగా ఆక్రోబేటిక్ విన్యాసాలు చేయడం మనకు కొత్తేమి కాదు. ఓ ఎత్తై పర్వత శిఖరాగ్రం నుంచి మరో ఎత్తైన పర్వత శిఖరాగ్రంపైకి తాడుకట్టి దానిమీద బ్యాలెన్స్‌గా నడిచే వాళ్లను కూడా చూసే ఉంటాం. కానీ ఎత్తైన పర్వత శిఖరంపై నుంచి కిందకు జాలువారే బీభత్సమైన జలపాతాల ముందు నుంచి కొండలపైకి సురక్షితంగా తాడుపై బ్యాలెన్స్‌గా నడవడాన్ని చూడకపోవచ్చు. అరుదుగా చూసినా నిమిషానికి 8, 60,000 గ్యాలన్ల నీరు కిందకు పడే వర్నల్ జలపాతం ముందు ఓ సాహసి నిర్వహించిన ఆక్రోబేటిక్ విన్యాసాలను మాత్రం ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చూడలేదు. కారణం ఈ వాటర్ ఫాల్ ముందు ఇలాంటి విన్యాసాలు సాహసించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. కింబర్లి వెల్‌జిన్ బృందమే మొదటిది. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోస్మైట్ నేషనల్ పార్కులో వర్నల్ అనే జలపాతం ఉంది. దాన్ని దూరం నుంచి చూస్తుంటే పర్యాటకులకు భయంతో వణుకు పుడుతుంది. అలాగే చూస్తే కళ్లు కూడా తిరుగుతాయి. ఎక్కువ సేపు ఉంటే వాటర్ సిక్కు కూడా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దానికి అతి సమీపం నుంచి ఓ కొండపైనుంచి మరో కొండకు తాడుకట్టి దానిపై బ్యాలెన్స్‌గా నడవడమే కాకుండా విన్యాసాలు చేయడం అంటే సాహసానినే సాహసం. ఎందుకంటే అక్కడ బయట సాధారణ తాడుపై నడిచినట్లు అక్కడి తాడుపై ఉండదు. చిమ్ముతున్న నీటి తుంపర్లతో కాళ్లు చేతులు తడుస్తుండడమే కాకుండా తాడు కూడా తడిసిపోయి జారుడుగా ఉంటుంది. దానిపై కింబర్లి వెల్‌జిన్ అనే 23 ఏళ్ల ముందుగా విన్యాసాలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఆమెతోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ ర్యాన్ జెంక్స్, స్నేహితులు స్కాట్ హాంగ్, ఎలెనా పోల్చుక్, మైఖేల్ మెల్నల్, సారా విహాన్‌లు ఒక పర్వతం నుంచి ఒక పర్వతానికి తాడుపై నడిచి రికార్డును నెలకొల్పారు. ఇక్కడ ఇలాంటి ప్రయత్నం సాహసికులు ఎవరూ చేయలేదు. కింబర్లి వెల్‌జిన్ బృందమే మొదటి సారి ఇలాంటి సాహసానికి ఒడిగట్టింది.