breaking news
Academy Books
-
అకాడమీ పుస్తకాలు సిద్ధం!
పోటీ పరీక్షలకు..అందుబాటులోకి జనరల్ స్టడీస్, తెలంగాణ చరిత్ర, సాంఘిక అంశాల పుస్తకాలు నాలుగైదు రోజుల్లో మరో ఐదు పుస్తకాల విడుదలకు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ ప్రత్యేక పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. పలు ఉద్యోగ పరీక్షల నోటిఫికేషన్లు జారీ అవుతున్న నేపథ్యంలో... పుస్తకాల కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, పోరాటాలు తదితర అంశాలకు సంబంధించి ‘ప్రైవేటు’ పుస్తకాలు కొన్ని మార్కెట్లో అందుబాటులో ఉన్నా... ప్రామాణిక పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల కోసం ప్రభుత్వ సంస్థ తెలుగు అకాడమీ ప్రధానమైన జనరల్ స్టడీస్, తెలంగాణ చరిత్ర-సంస్కృతి, సాంఘిక అంశాలపై పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. మరి కొన్ని పుస్తకాలను నాలుగైదు రోజుల్లో తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. టీఎస్పీఎస్సీ ప్రకటించిన పోటీ పరీక్షల సిలబస్ ఆధారంగా వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లతో ఈ పుస్తకాలను రాయించింది. ఇప్పటివరకు భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలనా శాస్త్రం, భౌతిక భూగోళ శాస్త్రం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర వంటి పుస్తకాలను అందుబాటులో ఉంచిన అకాడమీ... ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 8 రకాల పుస్తకాలను తీసుకురానుంది. ఇందులో మూడు పుస్తకాలను సోమవారం విడుదల చేసింది. మొత్తంగా వచ్చే 10 రోజుల్లో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. తెలంగాణపై ప్రత్యేక అంశాలు తెలంగాణ చరిత్ర-సంస్కృతి పుస్తకంలో తెలంగాణ పరిచయం నుంచి మొదలుకొని పూర్వ తెలంగాణ చరిత్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పూర్వకాలం, శాతవాహనుల తరువాత కాలం, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకరణులు, ముసునూరి నాయకులు, బహమనీ పరిపాలన, కుతుబ్‌షాహీల కాలం, మెఘల్ల కాలం, అసఫ్జాహీలు, నిజాంల పాలన, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు తదితర 33 అంశాలతో పాఠ్యాంశాలను పొందుపరిచింది. వీటితోపాటు తెలంగాణ చరిత్ర, భూగోళ, ఆర్థిక అంశాలు, సామాజిక, రాజకీయ ఉద్యమాలు, పర్యావరణ పోరాటాలు, తెలంగాణ ఉద్యమం, రాజకీయ పార్టీ లు, జేఏసీల పాత్ర, చరిత్ర ఆధారాలు, సంక్షిప్త రాజకీయ చరిత్ర, రాష్ట్ర నిర్మాణం, ఆర్థిక లక్షణాలు, తలసరి ఆదాయం, జనాభా లక్షణాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ పుస్తకాల్లో పాఠ్యాంశాలను పొందుపరుస్తోంది. అందుబాటులోకి తేనున్న పుస్తకాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పర్యావరణ సమస్యలు- అభివృద్ధి ప్రభుత్వ పాలనా శాస్త్రం సమాజ శాస్త్రం తెలంగాణ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం ఇదివరకే అందుబాటులో ఉన్నవి ఇండియన్ జియోగ్రఫీ భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ సోషియాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ భారత రాజ్యాంగం ప్రభుత్వ పాలనా శాస్త్రం భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర -
అకాడమీ పుస్తకాలు సిద్ధం!
-
పుస్తకాలే లేవు.. పాఠాలు ఎలా?
ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.. కళాశాలలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా తెలుగు అకాడమి పుస్తకాలు మార్కెట్లోకి రాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ ఏడాది ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ మారడంతో విద్యార్థులు మరింత కంగారు పడుతున్నారు.. ‘పాఠ్యపుస్తకాలు లేవు, కనీసం సిలబసైనా ప్రటికంచలేదు. విద్యార్థులకు ఏవిధంగా పాఠాలు బోధించాలి’ అని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.. - మారిన ఇంటర్మీడియెట్ ఆర్ట్స్ సిలబస్ - మార్కెట్లోకి రాని అకాడమి బుక్స్ - సిలబస్ ప్రకటించని ఇంటర్‌బోర్డు - ఆందోళనలో విద్యార్థులు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 61, ప్రైవేటు కళాశాలలు 174 ఉన్నాయి. ఆయా కాలేజిల్లో ఆర్ట్స్ గ్రూపులకు చెందిన మొదటి సంవత్సర విద్యార్థులు సుమారు 25వేల మంది ఉండగా వీరిలో తెలుగు మీడియం 15వేల మంది ఉన్నట్లు సమాచారం. జూన్ 2న కళాశాలలు ప్రారంభమైనా ఇంతవరకు పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో విద్యార్థులు రోజూ వచ్చి ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. కాగా గతేడాది నూతనంగా ప్రాజెక్టు వర్క్‌లు పెట్టడం, రాష్ట్ర విభజన తదితర కారణాలతో తరగతులకు దూరమైన విద్యార్థులు పూర్తిస్థాయిలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ ఏడాదైనా ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనుకున్న అధ్యాపకులకు పాఠ్యపుస్తకాల ముద్రణలో జాప్యం నిరాశకు గురిచేస్తోంది. ఈసారి సీనియర్ ఇంటర్ ద్వితీయ భాష సిలబస్ సైతం మారింది. తెలుగు, హిందీ, సంస్కృతంలో నూతన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. అయినా వీటికి సంబంధించిన పుస్తకాలు అకాడమి నుంచి నేటికీ మార్కెట్లోకి విడుదల కాలేదు. దీంతో సీనియర్ ఇంటర్ విద్యార్థుల్లోనూ ఆందోళన నెలకొంది. తెలుగు అకాడమి పుస్తకాలు ఎప్పుడు వస్తాయోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పాఠ్య పుస్తకాల్లో ఏముందో! మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ నేపథ్యంలో గత ఏడాది బైపీసీ విద్యార్థులకు భౌతిక, రసాయన శాస్త్రం సిల బస్‌ను మార్చారు. అలాగే ఈసారి ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించి సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులకు చెందిన సిలబస్‌లోనూ మార్పులు చేశారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు ఆ వివరాలను ఇంతవరకు ప్రకటించలేదు. కనీసం వెబ్సైట్లోనైనా పొందుపర్చలేదు. దీంతో కొత్త పుస్తకాల్లో ఏముందో విద్యార్థులకు ఏం బోధించాలో తెలి యక అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం సిలబస్ ప్రకటిస్తే పాఠ్యపుస్తకాలు వచ్చే వరకు కొంత మేరకు బోధించే అవకాశం ఉంటుందన్నారు.