breaking news
Parvathy Thiruvothu
-
చచ్చిపోవాలనిపించింది.. ఎంతోమందిని కలిశా..
చెప్పుకోలేని బాధ, విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందిపడుతున్నప్పుడు మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలా తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు థెరపీ తీసుకుని చాలా మంచి పని చేశానంటోంది మలయాళ నటి పార్వతి తిరువోతు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థెరపీ తీసుకోవడం అనేది నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం. అర్ధరాత్రి థెరపీకాకపోతే మనకు కరెక్ట్ థెరపిస్ట్ దొరకాలి. అందుకు నాకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను అమెరికన్ థెరపిస్ట్‌ను కలిశాను. అర్ధరాత్రి ఒంటిగంట, రెండు గంటల సమయంలో నాతో మాట్లాడేవారు. తర్వాత ఇక్కడే ఉన్న థెరపిస్ట్‌లను సంప్రదించాను. వారు నా సమస్యలేంటో గుచ్చిగుచ్చి అడిగి.. వాటిని వెలికితీసి మరింత బాధపెట్టేవారు.చచ్చిపోవాలన్న ఆలోచనలుఅప్పటికే నేను తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాను. చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కరెక్ట్ థెరపిస్ట్ దొరికాక నా బాధకు ఉపశమనం లభించింది. నన్ను ఎంతో బాధపెట్టిన 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్ని నా జీవితంలో నుంచే తీసేశాను. సినిమాప్రస్తుతం నేను కుటుంబం, ఫ్రెండ్స్, సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. పార్వతి బెంగళూరు డేస్, ఎన్ను నింటె మొయిదీన్, చార్లీ, ఉయరె, వైరస్, పుళు వంటి పలు చిత్రాల్లో నటించింది. దూత వెబ్ సిరీస్‌తో తెలుగువారికి సైతం పరిచయమైంది.గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
చిన్నప్పుడే లైంగిక వేధింపులు.. లిఫ్ట్‌లో అలా ప్రవర్తించాడు : హీరోయిన్
దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలోని ప్రతి మహిళ తన జీవితంలో కనీసం ఒక్కసారైనా లైంగిక వేధింపులకు గురవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి మహిళకు ఈ వేధింపుల తప్పడం లేదు. తాజాగా మలయాళ స్టార్ నటి పార్వతి తిరువోత్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పటి నుంచి పలు ఘటనలు ఆమెను మానసికంగా కలచివేశాయని చెప్పుకొచ్చారు.ఛాతీపై కొట్టాడు.. నా చిన్నప్పుడు ఒకసారి అమ్మా నాన్నలతో కలిసి రైల్వే స్టేషల్‌కు వెళ్లాను. ట్రైన్ కోసం పెరెంట్స్‌తో కలిసి నిలబడితే.. ఒకడు వచ్చి నా ఛాతీపై కొట్టి పారిపోయాడు. అతను కావాలనే అక్కడ టచ్ చేశాడు. ఆ సంఘటన నన్ను చాలా మానసిక క్షోభకు గురిచేసింది. ఆ తర్వాత నేను బయటకు వెళ్తే.. ఎలా ఉండాలో అమ్మ చెప్పేది. మగాళ్ల చేతులను చూస్తూ నడవాలని చెప్పాలి. ఒక తల్లి తన కూతురికి ఇలా నేర్పించాల్సిన పరిస్థితి రావడం దారుణం. ఆ ఒక్క సంఘటననే కాదు. చిన్నప్పుడు నాకు ఇలాంటివి చాలానే ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు ప్రైవేట్ పార్ట్‌ని చూపిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. స్కూల్లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించా. అతను నన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చమని వేధించాడు. ప్రేమిస్తే.. అనుమతి లేకపోయినా సరే ఆ పనికి ఒప్పుకోవాల్సిందేనా?లిఫ్ట్‌లో అలా.. కొట్టేశా19-20 ఏళ్ల వయసులో కూడా ఓ ఘటన జరిగింది. సినిమా కోసం స్నేహితులతో కలిసి మాల్కి వెళ్లాను. అనంతరం లిఫ్ట్‌లో కిందికి వస్తుంటే..ఒక వ్యక్తి నా దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. అతని ప్రైవేట్ పార్ట్ నాకు తగిలినట్లుగా అనిపించింది. లిఫ్ట్ దిగగానే అతన్ని చెంపపై కొట్టాను. సెక్యూరిటీ వచ్చి ఆపారు. పోలీసులకు ఫోన్ చేసి రప్పించాను. చివరికి అతను నా కాళ్ళ మీద పడి, 'నాకు ఇప్పుడే గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటున్నాను' అనడంతో వదిలేశా. నేను అతన్ని కొట్టినప్పుడు, అందరూ నన్ను అభినందించారు. కానీ అది పెద్ద విజయం అని నేను అనుకోలేదు. నన్ను నేను రక్షించుకోవడం పెద్ద విషయం కాదు’ అని పార్వతి చెప్పుకొచ్చింది. సినిమాలో విషయానికి వస్తే.. 2024లో వచ్చిన ‘ఉల్లోజుక్కు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతీ, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. -
కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్‌కు 'లోక' ఆఫర్!
మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం లోక. కల్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ ఉమెన్ చిత్రం లోక. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొత్త లోక: చాప్టర్ 1 పేరిట తెలుగులో విడుదలైంది. ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించాడు. 2025 ఆగస్టులో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా కల్యాణి ప్రియదర్శన్ కంటే ముందు పార్వతి తిరువోతును సంప్రదించినట్లు ఓ రూమర్ ఉంది.హీరోయిన్ అసహనంతాజాగా ఈ రూమర్‌పై పార్వతి సీరియస్ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రతమదృష్ట్య కుట్టకర్. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు పార్వతి హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు లోక సినిమా ఆఫర్ వచ్చిందా? అన్న ప్రశ్న ఎదురైంది. దానికామె స్పందిస్తూ.. ఇలాంటి ప్రశ్నలు అడగడం అనవసరం. మీరు ఇలాంటివి చాలా వింటుంటారు. మీకు నచ్చింది వినుకోండి అని బదులిచ్చింది.చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలిస్తా: నటికి బంపరాఫర్ -
ఇదో పిరికి చర్య: రాజీనామాలపై తంగలాన్ నటి
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు డైరెక్టర్స్, నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. ఇప్పటికే కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో సహా 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. తాజాగా తన సభ్యత్వానికి రాజీనామా చేయడంపై తంగలాన్ నటి పార్వతి తిరువోతు రియాక్ట్ అయ్యారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ మూకుమ్మడి రాజీనామా చేయడంపై నటి పార్వతి తిరువోతు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపంద చర్యలా ఉందని తెలిపారు. ఫిల్మ్ అసోసియేషన్‌లో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించింది. అయితే తమకు మాట్లాడే అవకాశం లేకపోవడంతో సంతోషంగా అసోసియేషన్‌కు రాజీనామా చేశానని పార్వతి తెలిపారు. మీడియాతో మాట్లాడే బాధ్యత నుంచి తప్పుకోవడం పిరికితనంగా అనిపించిందని పేర్కొన్నారు.ఈ విషయంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్వతి తిరువోతు ఆరోపించారు. మహిళలు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పేర్లతో రావాలని లాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పేర్లు చెప్పడం ముఖ్యమా? ఆ మహిళకు న్యాయం జరగడమా? అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. -
అద్భుతమైన నటి.. బోలెడు వివాదాలు.. 'తంగలాన్' బ్యూటీ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
తంగలాన్ సర్ప్రైజ్ చేస్తుంది
‘‘తంగలాన్ ’ తమిళ సినిమానో, తెలుగు సినిమానో కాదు. ఓ మంచి సినిమా. నా మనసుకు దగ్గరైన సినిమా. ‘తంగలాన్ ’ చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్స్, అడ్వెంచర్స్, మెసేజ్.. ఇలా చాలా అంశాలు ఉన్నాయి’’ అని విక్రమ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్స్. పా. రంజిత్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘తంగలాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ–‘‘వందేళ్ల క్రితం జరిగిన కథ ‘తంగలాన్’. ‘మద్రాస్’ సినిమా నుంచి పా.రంజిత్‌తో వర్క్ చేయాలనుకుంటే ‘తంగలాన్ ’తో కుదిరింది. నాకు మంచి రోల్ ఇచ్చిన రంజిత్‌కు థ్యాంక్స్. జ్ఞానవేల్ రాజాగారు బాగా స΄ోర్ట్ చేశారు. నేను గతంలో నటించిన పాత్రల్ని (శివపుత్రుడు, నాన్న, సేతు, అపరిచితుడు, ఐ..) ఈ వేదికపై చూడగానే భావోద్వేగంగా అనిపించింది. ఇలాంటి విభన్నమైన పాత్రలు ఇంకా చేయాలనే స్ఫూర్తి కలిగింది’’ అన్నారు. పా. రంజిత్ మాట్లాడుతూ–‘‘తంగలాన్ ’ రెగ్యులర్ మూవీ కాదు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుంది. విక్రమ్‌గారు అద్భుతంగా నటించారు. ఆయన దొరకడం నా అదృష్టం. ‘తంగలాన్ ’ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ్రపాణం. ‘తంగలాన్ ’ని స΄ోర్ట్ చేయండి. ఆగస్టు 15న విడుదలవుతున్న ‘మిస్టర్ బచ్చన్ ’, ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆయ్’ వంటి సినిమాలూ విజయాలు సాధించాలి’’ అన్నారు నిర్మాత జ్ఞానవేల్ రాజా. ‘‘ఈ చిత్రంలో ‘గంగమ్మ’ పాత్రలో నటించాను. విక్రమ్‌లాంటి కో స్టార్‌ని నేను ఇప్పటి వరకూ చూడలేదు’’ అన్నారు పార్వతి తిరువోతు. ‘‘విక్రమ్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్న నా కల ‘తంగలాన్ ’తో నిజమైంది’’ అన్నారు మాళవికా మోహనన్ . ‘‘ఇదొక అద్భుతమైన మూవీ’’ అన్నారు నటుడు డేనియల్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, స్టూడియోగ్రీన్ ఎగ్జిక్యూటివ్ సీఈవో ధనుంజయన్ , నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, ఎస్కేఎన్ , దర్శక–నిర్మాత సాయిరాజేష్, దర్శకుడు కరుణకుమార్, మైత్రీ మూవీస్ శశి మాట్లాడారు. -
మేకప్‌కే నాలుగు గంటలు.. శరీరంపై దద్దుర్లు వచ్చాయి: ‘తంగలాన్’ హీరోయిన్
విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) కార్మికుల జీవితాల ఆధారంగా పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. హీరోహీరోయిన్లతో వరుస ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు ప్రెస్ మీట్ నిర్వహించారు. (చదవండి: విజయ్ దేవరకొండతో వివాదం.. మరోసారి స్పందించిన అనసూయ)ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ.. ‘తంగలాన్’ నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ఈ చిత్రంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను మేకప్ వేసుకోవడానికే దాదాపు నాలుగు గంటల సమయం పట్టేది. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశాం. దాని కారణంగా నా శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రోజూ సెట్స్‌లో డెర్మటాలజిస్ట్, కళ్ల డాక్టర్.. ఇలా మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉండేవారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని అన్నారు. పార్వతి తిరువోతు మాట్లాడుతూ.. ‘పా.రంజిత్ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తంగలాన్ లో నాది గంగమ్మ అనే కీలక పాత్ర. ఈ పాత్ర కోసం ఎంతో శ్రమించా. భాషపరంగా కసరత్తు చేశా’ అని తెలిపారు. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. ఏ రంగంలో అడుగుపెట్టేవారని ఓ విలేకరి ప్రశ్నించగా.. టీ షాపు పెట్టేదాన్ని అని సమాధానం ఇచ్చింది పార్వతి. ‘వృత్తి ఏదైనా సరే మరాద్య, గౌరవంతో పని చేయాలనుకున్నాను. నాకు టీ అంటే చాలా ఇష్టం. టీ చక్కగా పెట్టగలను. అందుకే ఒకవేళ నటిని కాకపోయి ఉంటే..కచ్చితంగా ఓ టీ షాపు పెట్టేదాన్ని’అని పార్వతి చెప్పుకొచ్చింది. తనకు విజువల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టమని, ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే ఫొటోగ్రఫీ, లేదా సినిమాటోగ్రఫీ రంగంలోకి వెళ్లేదాన్ని అని పార్వతి బదులిచ్చింది.


