breaking news
on 21st
-
21న పెద్దారెడ్డి సంస్మరణ సభ
అనంతపురం సప్తగిరి సర్కిల్: సామాజిక విప్లవకారుడైన పెద్దారెడ్డి సంస్మరణ సభ ఈ నెల 21న కొత్తచెరువులో నిర్వహిస్తున్నట్లు పోతుల సురేష్ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 1న పెద్దారెడ్డి మృతి చెందారని, ఆయన జ్ఞాపకార్థంగా సంస్మరణ సభను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ బంగి. సుదర్శన్, రామాంజినేయులు, అల్లాబకష్, లింగమయ్య పాల్గొన్నారు. -
21న మెగా డ్యాన్స్ షో
ఖమ్మం కల్చరల్: తెలంగాణ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం మెగా టీమ్ సహకారంతో ఈ నెల 21న నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఖమ్మం జిల్లా మెగా డ్యాన్స్ షో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రిథమ్ సైదులు, లింగనబోయిన కిరణ్‌కుమార్‌లు తెలిపారు. ఇం దుకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ఆవిష్కరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైదులు, కిరణ్‌లు మాట్లాడుతూ జిల్లాలోని 500మంది డ్యాన్స్ మాస్టర్లతో మెగా హరితహారం కార్యక్రమం కూడా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని డ్యాన్స్ మాస్టర్లు, అసోసియేషన్ సభ్యు లు, డ్యాన్సర్లు పాల్గొని మెగా డ్యాన్స్షోను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మెగా టీమ్ అధ్యక్షుడు రుద్రగాని ఉపేందర్, వీరేష్‌గౌడ్, అంకిత్, తెలంగాణ డ్యాన్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పి. ఉమామహేశ్వర్, యు. నాగరాజు, కోశాధికారి గుండు నాగరాజు, టౌన్ అధ్యక్షుడు భవాని శంకర్, ప్రధాన కార్యదర్శి ఎ. రాజేష్, కోశాధికారి నాని తదితరులు పాల్గొన్నారు.