టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి పుట్టినరోజు నేడు
ఈ సందర్భంగా సతీమణికి రాహుల్ విషెస్ తెలిపాడు
మై క్రేజీ బర్త్‌డే బేబీ అంటూ ఫొటోలు పంచుకున్నాడు
స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాహుల్ పాల్గొన్నాడు
అయితే, తొలి టెస్టులో విఫలం కావడంతో మిగిలిన రెండు టెస్టుల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు
తదుపరి ఆస్ట్రేలియా పర్యటనతో రాహుల్ బిజీ కానున్నాడు
బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి కుమార్తె అతియాను ప్రేమించిన రాహుల్ గతేడాది ఆమెను వివాహం చేసుకున్నాడు


