
ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన మానవత్వపు గోడ ఫొటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

తొలకరి పచ్చదనంపై తిరుగుతున్న రంగు రంగుల సీతాకోక చిలుకలు ఫొటో: విజయ కృష్ణ, అమరావతి

మద్యంపై యుద్ధం: మద్యం దుకాణాన్ని ద్వంసం చేస్తున్న మహిళలు ఫొటో: బాషా, అనంతపురం

మురికి కూపాలు: కల్వర్టు నుంచి పూడిక తీస్తున్న కార్మికుడు ఫొటో: వీరేష్, అనంతపురం

గబ్బిలాల బడి: గురుకుల బాలుర పాఠశాలలో నివాసం ఏర్పాటు చేసుకున్న గబ్బిలాలు ఫొటో: సంపత్, భూపాలపల్లి

జననేత: గరపగర్రు దలితవాడలో భోంచేస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

ఉడుంపట్టు: హ్యాపీ సండే సాంస్కతిక కార్యక్రమాల్లో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్న విద్యార్థులు ఫొటో: రాంగోపాల్ రెడ్డి, గుంటూరు

గెలుపే లక్ష్యం: ట్యాంక్‌బండ్‌లో ఏర్పాటు చేసిన సైలింగ్ పోటీలో దూసుకుపోతున్న ఆటగాళ్లు ఫొటో: బాలాస్వామి, హైదరాబాద్

కన్నుల పండుగ: బంజారాహిల్స్‌లోని జగన్నాథ ఆలయంలో నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర ఫొటో: దయాకర్, హైదరాబాద్

రాజేంద్రనగర్‌లో జరిగన కార్యక్రమంలో యంత్రం ద్వారా చెట్టు ఎక్కడాన్ని గమనిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

పిచ్చిపిచ్చిగా పెరిగింది: మాసబ్‌ట్యాంక్ వద్ద జీహెచ్‌ఎంసీ వీధిటైటుకు అల్లుకుపోయిన పిచ్చితీగలు ఫొటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

హైదరాబాద్ బోనాల సందర్భంగా బోనమెత్తిన జోగిని శ్యామల ఫొటో: నాగరాజు, హైదరాబాద్

మమ్మీ అంటే ఇదే: వైఎస్సార్ మ్యూజియంలో ఉన్న ఈజిప్టు మమ్మీని పరిశీలిస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ ట్రైనింగ్ అధికారులు ఫొటో: రాకేష్, హైదరాబాద్

పార్క్ హయత్ హోటల్‌లో ఆకృతి ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రోజా ఫొటో: ఎస్‌ఎస్ టాకూర్, హైదరాబాద్

పేర్చినట్లుగా: రాచకొండ గుట్టల్లో ఒకదానిపై మరొకటి పేర్చినట్లుగా ఉండి చూపరులను ఆకట్టుకుంటున్న కొండరాళ్లు ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్ ఫొటో: సురేష్ కుమార్

మన కళ-మన సాంప్రదాయం: తెలంగాణ కళాకారుల విన్యాసాలను ఫోనులో బంధిస్తున్న కోదండరాం ఫొటో: వేణుగోపాల్, జనగాం

మద్యంపై యుద్ధం: కడపలో మద్యం దుకాణంలో సీసాలను ద్వంసం చేస్తున్న విద్యార్థులు, మహిళలు ఫొటో: రమేష్, కడప

స్నేహం కోసం: దివ్యాంగులు తమ ట్రైసైకిల్ సహాయంతో అంధుడిని గమ్యాన్ని చేర్చుతున్న దృశ్యం ఫొటో: హుస్సేన్, కర్నూలు

చాపరాయి గ్రామంలో బాధితులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటో: సతీష్ కుమార్, కాకినాడ

సినీ సందడి: కరీంనగర్‌లో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ వద్ద సందడి చేస్తున్న హీరోయిన్ సమంత, హీరో అఖిల్ ఫొటో: స్వామి, కరీంనగర్

మనసున్నమారాజు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన ఆరోగ్యశ్రీ వల్లే బ్రతికానంటున్న అమ్మగారు ఫొటో: మచిలీపట్నం, అజీజ్

కమ్ముకుంటున్న కారుమబ్బులు: దట్టమైన మబ్బులతో నిండిపోయిన మెదక్ పట్టణం ఫొటో: దేవేంద్ర, మెదక్

చిగురించిన ఆశలు: వర్షం రాకతో చిగురించిన అటవీ ప్రాంతం ఫొటో: సుధాకర్, నాగర్ కర్నూల్

చెట్టు ఒకటే.. తలలు రెండు: కొబ్బరి చెట్టుకు రెండు తలలు ఉండటంతో పాటు రెండు తలలకు కాయలు కాస్తున్న దృశ్యం ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

బాల్యం బరువులు మోయాల్సిందే.. కాకపోతే చదువుల బరువు ఒకరిది.. బతుకు భారం మోయాల్సిన బరువు మరొకరిది ఫొటో: వెంకట రమణ, నెల్లూరు

చదివేదెలా...: పెద్దపల్లి బండారికుంటలోని అంగన్‌వాడీ పాఠశాలలో చిరు వర్షానికే చెరువులా మారడంతో ఆటలాడుతున్న పిల్లలు ఫొటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

జనంతో జననేత: ఏజెన్సీ పర్యటనలో వైఎస్ జగన్‌తో సెల్ఫీలు దిగుతున్న స్థానికులు ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

సార్...సార్..నా సమస్య వినండి: తన సమస్య వినమని మంత్రి కారు వెంట పరిగెడుతున్న స్థానికుడు ఫొటో: సతీష్, సిద్దిపేట

తీగలున్నాయి జాగ్రత్త: కరెంట్ తీగలు తగలకుండా కర్రతో ఎత్తిపట్టుకున్న యువకుడు ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

రేపటి రైతు: తండ్రికి ఆసరాగా వరిమళ్లు దున్నుతున్న రైతు బిడ్డ ఫొటో: యాకయ్య, సూర్యాపేట

మొక్కలు నాటుదాం: హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నమంత్రి కేటీఆర్ ఫొటో: శ్రీకాంత్, సిరిసిల్ల

తిరుమలలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి చెన్నకేశవులను అమ్మ ఒడికి చేర్చుతున్న డీఐజీ ప్రభాకర్‌రావు , ఎస్పీ జయలక్ష్మి ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి

మీకు వందనం: జునోసిస్ డే సందర్భంగా విన్యాసం చేస్తున్న శునకాలు ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

ఒక్కపూటైనా కడుపునిండా..: ఫైవ్‌స్టార్ హోటల్లో భోంచేస్తున్న అనాధ పిల్లలు ఫొటో: భగవాన్, విజయవాడ

మేం స్టెప్పేస్తే..: హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా నాట్యం చేస్తున్న చిన్నారులు ఫొటో: కిషోర్, విజయవాడ

మద్యం మంట: మద్యంషాపు పెట్టవందంటూ జ్ఞానాపురంవద్ద కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న కాలనీ వాసులు ఫొటో: ఎండీ నవాజ్, వైజాగ్

నేను స్నానం చేస్తా...: నీటిలోకి దిగిన గుర్రం ఫొటో: మోహన్, వైజాగ్

లాఠీచార్జ్..: మద్యం దుకాణాలు వద్దంటూ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై లాఠీచార్జ్ ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

స్మైల్ ప్లీజ్: బోనాల సందర్భంగా సెల్ఫీ దిగుతున్న పోతురాజులు ఫొటో: వరప్రసాద్, వరంగల్

అందం బంధిద్దాం..: సెల్ఫీ దిగుతున్న పేరిణి నత్య కళాకారులు ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

నా వంతు: హరితహరంలో భాగంగా యాదాద్రిలో మొక్కని నాటుతున్న పోలీస్ అధికారి ఫోటో: శివకుమార్, యాదాద్రి