‘మోంథా’ తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి.
వరి, మొక్క జొన్న, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా ముంపు నీటిలో నానుతున్నాయి. కోతకొచ్చే దశలో తుపాను బారిన పడడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావం వల్ల 30 శాతం మేర దిగుబడులు తగ్గిపోనున్నాయని ప్రాథమిక అంచనా.
తుపాను ప్రశాంతంగానే తీరం దాటినప్పటికీ, కుండపోత వర్షాలతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది.


