సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తోంది.
ఈ విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
కొందరైతే తప్పు నీవైపు ఉందంటే నీవైపుందని చై, సామ్‌లను తిడుతూనే ఉన్నారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ .. అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు అని సమంతను నిలదీశాడు
ఇది చూసిన సామ్.. సారీ, ఇలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు. ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ నేర్చుకో అని కౌంటరిచ్చింది.
ఇది చూసిన అభిమానులు సామ్‌ను మెచ్చుకుంటున్నారు.
సందు దొరికితే చాలు తిట్టేందుకు రెడీగా ఉన్నవాళ్లకు ఇలాగే బుద్ధి చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు.


