రాంగోపాల్ వర్మ 'రంగీలా' సినిమాతో దేశవ్యాప్తంగా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఊర్మిళ మతోండ్కర్.
ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది.
రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది.
సత్య, అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు వంటి సినిమాల్లో నటించింది.
ఆర్జీవీ సినిమాల కోసం అందివచ్చిన భారీ ఆఫర్లను కూడా ఊర్మిళ వదులుకుంది.
వర్మ సినిమాల నుంచి ఆమె ఎప్పుడైతే దూరం అయిందో ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి.
2016లో జమ్మూకశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త, మోడల్ మోసిన్ అక్తార్‌ను ఊర్మిళ పెళ్లి చేసుకుంది.
వయసులో తన భర్త మోసిన్ కంటే ఊర్మిళ 10 ఏళ్లు పెద్ద.
ఎనిమిదేళ్ల పాటు తన భర్తతో కలిసి జీవించిన ఊర్మిళ.. ముంబయి కోర్టులో నాలుగు నెలల క్రితం విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది.
మొదట కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ అదే ఏడాదిలో ముంబయి నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత, 2020లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనలో ఆమె చేరింది.
ఈ విడాకుల గురించి ఊర్మిళ అధికారికంగా ప్రకటించలేదు.


