నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే
తారక రామారావు హీరోగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తాజాగా హీరోయిన్‌ను ప్రకటించారు విజయవాడకు చెందిన వీణారావు ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.
వైవీఎస్ చౌదరి దాదాపుగా కొత్తవారిని తెలుగు పరిశ్రమకు పరిచయం చేస్తుంటారు.
'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన వీణారావు నటిస్తున్నట్లు ప్రకటించడంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వీణారావు కూచిపూడి డ్యాన్సర్ అని వై.వి.ఎస్.చౌదరి తెలిపారు.
మన అచ్చతెలుగు అమ్మాయి అని నిర్మాతలు సుప్రియ, స్వప్నదత్‌లు వీణారావును ఇండస్ట్రీకి పరిచయం చేశారు.


