నగరానికి చెందిన చిన్నారి ‘కుమారి శార్ణిత దత్త రాచ’కేవలం ఏడేళ్ల వయసులో మూడు గంటలపాటు నిరాటంకంగా పూర్తి స్థాయి కుచిపూడి రంగప్రవేశ నృత్యం ప్రదర్శించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
రవీంద్రభారతిలో జరిగిన ఈ చరిత్రాత్మక ప్రదర్శన ఆమెను ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన కుచిపూడి నర్తకిగా నిలిపింది. శారద కళాక్షేత్ర భవన్ కుచిపూడి డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు గురుభావన పెదప్రోలు శిక్షణలో తనను తాను తీర్చిదిద్దుకున్న శార్ణిత కళానైపుణ్యం, భావప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.


