
విజయవాడ కల్చరల్: మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ విద్యా సంస్థల్లో సోమవారం నిర్వహించిన నృత్యోత్సవం 2024 ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి

కూచిపూడి, తమిళనాడుకు చెందిన భరతనాట్యం, కేరళకు చెందిన మోహినీ అట్టం, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలను విద్యార్థులు మనోహరంగా ప్రదర్శించి జాతీయ సమైక్యతను చాటారు

విద్యార్థుల నృత్యాలు చూసి అందరూ కేరింతలు కొట్టారు. ఎంతో సందేశాత్మకంగా నృత్య ప్రదర్శనలు కొనసాగాయి

సిద్ధార్థ్థ కళాశాల అనుబంధ కళాశాలలైన నర్సింగ్ కళాశాల, మహిళా కళాశాల, వైద్య కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల చెందిన విద్యార్థులు 125 మంది వివిధ అంశాలను ప్రదర్శించారు

విద్యార్థులకు కళాపీఠం పక్షాన అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు

నృత్యోత్సవంలో కళాపీఠం అధ్యక్షుడు పి.లక్ష్మణరావు, కళాపీఠం ప్రధాన కార్యదర్శి ఎన్.లలిత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

























