
(వెంకటగిరి): పట్టణంలో ఈ నెల 25వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమైన పోలేరమ్మ జాతర గురువారం జరిగిన నగరోత్సవం, నిమజ్జనంతో ముగిసింది.

జాతరకు ఇతర రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు విచ్చేశారు

ఉదయం నుంచి పోలేరమ్మ తల్లిని దర్శించుకునేందు కు బారులు తీరారు. దీంతో ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరి సిపోయాయి

సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పోలేరమ్మను కొలువుదీర్చి నగరోత్సవం ని ర్వహించారు

ఆలయం మండపం నుంచి ప్రారంభమైన ఊరేగింపు రాజావీధి, కాశీపేట సెంటర్, పాత శివాలయంవీధి మీదుగా అమ్మవారి నిష్క్రమణ మండపం వరకు సాగింది




























