భువనగిరిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు | corden search in bhongiri | Sakshi
Sakshi News home page

భువనగిరిలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

Jan 13 2018 8:34 AM | Updated on Jan 13 2018 8:34 AM

సాక్షి, యాదాద్రి భువనగిరి:  భువనగిరిలోని సంజీవనగర్‌లో పోలీసులు శనివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భువనగిరి జోన్ డీసీపీ రాంచందర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా సోదాలు చేశారు. ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 200 మంది పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

సరైన అనుమతి పత్రాలు లేని 2 కార్లు, 40 బైకులు, ఒక ఆటోను సీజ్ చేశారు. ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీలో గుట్కాలు విక్రయిస్తున్న వ్యక్తి సహా మద్యం అమ్ముతున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement