టాంజ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం | telangana association of new zealand conducted meet and greet program | Sakshi
Sakshi News home page

టాంజ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

Dec 21 2016 7:07 PM | Updated on Sep 4 2017 11:17 PM

టాంజ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

టాంజ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ్) ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది.

ఆక్లండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ్) ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఢిల్లీ అధికార ప్రతినిధి రామచంద్రు తేజావత్ దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆక్లండ్ విమానాశ్రయంలో టాంజ్ ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, అడ్వైజరీ కమిటీ సభ్యులు జగన్ వడ్నాల తేజావత్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.

మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని తేజావత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తేజావత్ మాట్లాడుతూ... ఢిల్లీలో ఆయన నిర్వహించే బాధ్యతల గురించి ప్రస్తవించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు సీఎం పట్టుదలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తేజావత్ దంపతులను టాంజ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం టాంజ్ సభ్యులను తేజావత్ సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార‍్యక్రమానికి టాంజ్ జనరల్ సెక్రటరీ దయాకర్ బచ్చు, సభ్యులు దయానంద్ కటకం, శ్రీనివాస్, శీసుత, విజేత, సుశాంతి, అరుణ్ ప్రకాశ్, విజయ్, గ్రీష్మ, సునీతతో పాటు టీఆర్ఎస్ పార్టీ న్యూజిలాండ్ సభ్యులు కూడా పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement