
టెన్త్, ఇంటర్, వ్యవసాయ డిప్లొమా పూర్తిచేసిన 18–25 ఏళ్ల మధ్య యువతీయువకులకు డాక్టర్ చోహన్ క్యు (దక్షిణ కొరియా) సహజ సాగు పద్ధతిలో 40 రోజుల పాటు న్యూలైఫ్ ఫౌండేషన్ (హైదరాబాద్) ఉచిత శిక్షణ ఇవ్వనుంది
టెన్త్, ఇంటర్, వ్యవసాయ డిప్లొమా పూర్తిచేసిన 18–25 ఏళ్ల మధ్య యువతీయువకులకు డాక్టర్ చోహన్ క్యు (దక్షిణ కొరియా) సహజ సాగు పద్ధతిలో 40 రోజుల పాటు న్యూలైఫ్ ఫౌండేషన్ (హైదరాబాద్) ఉచిత శిక్షణ ఇవ్వనుంది. శిక్షణతోపాటు భోజనం, వసతి కూడా ఉచితమే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి శిక్షణ ఇస్తామని ఫౌండేషన్ ప్రతినిధి శివశంకర్ తెలిపారు. చో సహజ సాగుతో పాటు చింతల వెంకటరెడ్డి మట్టి ద్రావణంతో సేద్యంపై కూడా శిక్షణ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా 86868 64152, 98660 73174 నంబర్ల ద్వారా వాట్సాప్‌లో సంప్రదించవచ్చు.