జైపాల్ రెడ్డి నివాసంలో టి.కాంగ్ నేతల భేటీ | Telangana Congress leaders Meet at Jaipal Reddy Residence | Sakshi
Sakshi News home page

జైపాల్ రెడ్డి నివాసంలో టి.కాంగ్ నేతల భేటీ

Nov 17 2013 10:18 AM | Updated on Aug 11 2018 7:11 PM

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందానికి(జీఓఎం)కు వినిపించాల్సిన అంశాలపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, రాంరెడ్డి వెంకట రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

తెలంగాణ బిల్లుకు తుది రూపం ఇచ్చే పనిలో జీవోఎం నిమగ్నమై ఉండటంతో సదరు బిల్లులో ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా ఒత్తిడి తేవాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా ఇక్కడకు వచ్చారు. దీంతోపాటు సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించాలని భావించారు. అందులో భాగంగా మూడు రోజులపాటు హస్తినలో మకాం వేసి జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలవాలని హస్తినకు విచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement