‘‘రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మున్ముందు విశాలాంధ్రకు ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు కాంగ్రెస్‌కు పుట్టగతులుండవన్న భయంతోనే రాష్ట్ర విభజన ప్రక్రియకు యూపీఏ శ్రీకారం చుట్టింది.
జగన్ సీఎం అవుతారనే భయంతోనే...
‘‘రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మున్ముందు విశాలాంధ్రకు ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు కాంగ్రెస్‌కు పుట్టగతులుండవన్న భయంతోనే రాష్ట్ర విభజన ప్రక్రియకు యూపీఏ శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని విభజించే విషయంలో కేంద్రం శాస్త్రీయ దృ క్పథాన్ని పాటించలేదు. కేవలం తెలంగాణలో రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకునేందుకు, సీఎం పీఠం కోసమే వారికి ప్రత్యేక రాష్ట్రం అవసరమైంది. రాహుల్‌ని ప్రధానిని చేయాలన్న ఆశతో రాష్ట్ర విభజనకు సోనియా తెర తీశారు’’
- ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
కోస్తా ఉప్పునీటి ఎడారే
‘‘విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న కోస్తా జిల్లాలన్నీ ఉప్పు నీటి ఎడారులుగా మారతాయి. తెలంగాణకు, సీమాంద్రకు సమ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలి’’
- ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి
‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ఈ గతి పట్టేది కాదు’’
- ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి
వైఎస్ ఉంటే విభజన జరిగేది కాదు
‘‘వైఎస్ ఉంటే రాష్ట్రాన్ని రెండు ముక్కలు కానిచ్చేవారు కాదు. ఆయన తదనంతరం రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మార్చింది. విశాలాంధ్రను ముక్కలు కాన్వికుండా ప్రజలందరూ ఉద్యమించాలి’’
- ఎమ్మెల్యే మేకతోటి సుచరిత
బాబు వంతపాడటం దారుణం
‘‘కేవలం రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే విభజనకు సోనియా శ్రీకారం చుట్టారు. ఇందుకు చంద్రబాబు కూడా వంత పాడటం దారుణం’’
- ఎమ్మెల్యే బాలరాజు
బాబు వల్లే చేటుకాలం
‘‘పాపిష్టి చంద్రబాబు వల్లే రాష్ట్రానికి చేటు కాలం దాపురించింది. విభజన జరిగితే తెలుగు జాతిని చీల్చిన ఘనత టీడీపీకే దక్కుతుంది’’
- ఎమ్మెల్యే జోగి రమేశ్
కాంగ్రెస్‌తో బాబు చీకటి ఒప్పందం
‘‘స్వార్థ రాజకీయంతో గద్దె నెక్కాలని కలలు కంటున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కారణమవుతున్నారు’’
- ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి