ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైఎస్ఆర్ సీపీ మద్దతు | YSRCongress Party support to TRS due to MLC elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైఎస్ఆర్ సీపీ మద్దతు

May 31 2015 12:47 PM | Updated on Aug 29 2018 6:26 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైఎస్ఆర్ సీపీ మద్దతు - Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైఎస్ఆర్ సీపీ మద్దతు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైఎస్ఆర్ సీపీ మద్దతు ప్రకటించింది.

హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైఎస్సార్ సీపీ మద్దతిస్తున్నట్లు ఆ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి తమకు లేనందున టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు.  ఆదివారం ఉదయం హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశానికి సంబంధించి వైఎస్ఆర్ సీపీ మద్దతుపై వారు చర్చించారు.  అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి తమ పార్టీకి లేనందున టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తున్నామన్నారు. బాధ్యత గల రాజకీయ పార్టీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ... కాంగ్రెస్ మద్దతు తీసుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే నిన్నటి వరకూ దుమ్మెత్తిపోసిన పార్టీతో టీడీపీ చేతులు కలిపి సతీష్రెడ్డిని డిప్యూటీ ఛైర్మన్గా గెలుపించుకుందని వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు విప్ జారీ చేసి మరీ కాపాడిన వైనాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశదీకరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి విలువలు లేవని.. వారికి బుద్ధి చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement