
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీ ఆర్‌ఎస్‌కు మద్దతు
ఎటువంటి విలువలు లేని చంద్రబాబు పార్టీ (టీడీపీ), కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పేందుకు శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో....
* వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
* టీడీపీ, కాంగ్రె స్‌లకు బుద్ధి చెప్పేందుకేనని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎటువంటి విలువలు లేని చంద్రబాబు పార్టీ (టీడీపీ), కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పేందుకు శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించినట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబట్టే పరిస్థితి ప్రస్తుతం తమ పార్టీకి లేదని, అయితే బాధ్యత గల పార్టీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియలో అంతకుముందు వరకు కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసిన టీడీపీ, అదే కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో డిప్యూటీ చైర్మన్‌గా తమ సభ్యుడు సతీశ్ రెడ్డిని గెలిపించుకుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు.
అంతకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీఎం కిర ణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు విప్ జారీ చేసి కాపాడిన సందర్భాన్నీ చూశామన్నారు. ఇటువంటి విలువలు లేని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు పొంగులేటి వివరించారు.