ఫ్లిప్‌కార్ట్ ఖాతాలో యాపిటరేట్ | Yapitaret In flipkart account | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్ ఖాతాలో యాపిటరేట్

Apr 30 2015 12:33 AM | Updated on Sep 3 2017 1:07 AM

మొబైల్ మార్కెటింగ్ స్టార్టప్ సంస్థ యాపిటరేట్‌ను కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

న్యూఢిల్లీ : మొబైల్ మార్కెటింగ్ స్టార్టప్ సంస్థ యాపిటరేట్‌ను కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇందుకు ఎంత వెచ్చించినదీ తెలపలేదు. మొబైల్ టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తమకు ఈ కొనుగోలు ఉపకరించగలదని కంపెనీ వివరించింది.

తమ మొబైల్ యాప్‌లో యాపిటరేట్ మొబైల్ మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానిస్తామని పేర్కొంది. వెబ్‌పేజీలో చేపట్టే కొత్త మార్పులు, చేర్పుల ప్రభావం అమ్మకాలపై ఏ విధంగా ఉంటుందనేది విశ్లేషిస్తుంది యాపిటరేట్. గ్రెగ్ బాద్రోస్, ప్రశాంత్ మాలిక్ వంటి ఏంజల్ ఇన్వెస్టర్లతో పాటు ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్ వంటి సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి యాపిటరేట్ నిధులు సమీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement