విమానంలోంచి ఈడ్చి పడేశారు.. | Woman Dragged Off Plane, Arrested For Not Following Boarding Procedures | Sakshi
Sakshi News home page

విమానంలోంచి ఈడ్చి పడేశారు..

Dec 14 2016 11:38 AM | Updated on Sep 4 2017 10:44 PM

విమానంలోంచి ఈడ్చి పడేశారు..

విమానంలోంచి ఈడ్చి పడేశారు..

బోర్డింగ్ నియమాలు పాటించలేదని ఓ మహిళను అధికారులు విమానంలో నుంచి ఈడ్చిపారేశారు.

మిచిగాన్: బోర్డింగ్ నియమాలు పాటించలేదని ఓ మహిళను అధికారులు విమానంలో నుంచి ఈడ్చిపారేశారు. ఈ ఘటన మిచిగాన్ లోని డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎయిర్ పోర్టు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ సిద్ధంగా ఉన్న సమయంలో మహిళ(పేరు చెప్పలేదు) నియమాలను ఉల్లంఘిస్తూ.. సిబ్బంది చెప్పినా వినకుండా విమానంలోకి ప్రవేశించినట్లు చెప్పింది.
 
టెర్మినల్ గేటు వద్ద బ్యాగేజి చెకింగ్, బోర్డింగ్ వద్ద అధికారుల మాటలను పట్టించుకోలేదని పేర్కొంది. విమానంలో కూర్చున మహిళను ఎయిర్ పోర్టు అధికారులు ఈడ్చుకుంటూ లాక్కెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఆమెను అధికారుల అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement