వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో 70 ఏళ్ల వృద్ధురాలు మరణించారు. ఆమె మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి.
వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో 70 ఏళ్ల వృద్ధురాలు మరణించారు. ఆమె మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర దుర్ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. వేగంగా వచ్చిన ఆ కారు వీళ్లు ప్రయాణిస్తున్న స్కూటీతో పాటు మరో నాలుగు వాహనాలను ఢీకొంది. తూర్పు ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
భూరాదేవి అనే వృద్ధురాలు తన మనవరాలు మీనాక్షితో కలిసి స్కూటీ మీద వెళ్తుండగా కారు వచ్చి వారిని ఢీకొంది. బాధితులిద్దరినీ గురు తేజ్ బహదూర్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ భూరాదేవి మరణించారని, మీనాక్షి కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ కారును వదిలేసి అక్కడినుంచి పారిపోగా, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని నిందితుడిపై కేసు నమోదు చేశారు.