నరేంద్ర దబోల్కర్ హత్య కేసు ఛేదిస్తాం | Will crack Narendra Dabholkar murder soon: Gulabrao Pol | Sakshi
Sakshi News home page

నరేంద్ర దబోల్కర్ హత్య కేసు ఛేదిస్తాం

Sep 6 2013 11:04 AM | Updated on Aug 15 2018 5:57 PM

ప్రముఖ హేతువాద నాయకుడు నరేంద్ర దబోల్కర్ కేసు సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తామని పూనే పోలీసు కమిషనర్ గులాబ్రావు పోల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మూఢనమ్మకాలు, దురాచారాల నిర్మూలనకు రాజీలేని పోరాటం సాగిస్తూ దారుణ హత్యకు గురైన ప్రముఖ హేతువాద నాయకుడు నరేంద్ర దబోల్కర్ కేసు సాధ్యమైనంత త్వరగా ఛేదిస్తామని పూనే పోలీసు కమిషనర్ గులాబ్రావు పోల్ ధీమా వ్యక్తం చేశారు.ఆయన హత్యకు పాల్పడిన నిందితుల కోసం క్రైం బ్రాంచ్ పోలీసులు తమ చర్యలను ముమ్మరం చేశారని తెలిపారు. నిందితుల సంబంధించి సీసీకెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

 

అయితే ఫుట్ ఇమేజ్లలో వారి ముఖ కవళికలు సరిగా లేవని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పూనే గ్రామీణ పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారని ఆయన వివరించారు. అలాగే అహ్మద్నగర్లోని శ్రీరాంపూర్ తాలుకాలో మరో ఇద్దరిని పోలీసులు ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని ఆయన తెలిపారు.

 

గత నెల ఆగస్టు 21న  పుణేలోని ఓంకారేశ్వర్ దేవాలయ సమీపాన ఉన్న వంతెనపై ఉదయం 7.30 గంటలకు మార్నింగ్‌వాక్ చేసి వస్తుండగా ఆయనపై ఆగంతకులు కాల్పులు జరిపారు.స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దబోల్కర్ ససూన్ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే దబోల్కర్ మరణించారని వైద్యులు వెల్లడించారు.ఆ ఘటనపై కేసు దర్యాప్తునకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement