రెండో పెళ్లికి భార్య అంగీకారం అక్కర్లేదు | Wife's consent for man's second marriage not needed: Pakistan body | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లికి భార్య అంగీకారం అక్కర్లేదు

Mar 11 2014 1:01 PM | Updated on Oct 22 2018 6:02 PM

భర్త రెండో పెళ్లికి మొదటి భార్య అంగీకారం అవసరం లేదని పాకిస్థాన్కి చెందిన ద కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సీఐఐ) చేసిన సూచనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇస్లామాబాద్: భర్త రెండో పెళ్లికి మొదటి భార్య అంగీకారం అవసరం లేదని పాకిస్థాన్కి చెందిన ద కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సీఐఐ) చేసిన సూచనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి భార్య అంగీకారంతో ఆమె సమక్షంలోనే భర్త రెండో పెళ్లి చేసుకోవాలన్న పాకిస్థాన్ ప్రభుత్వ చట్టం మత నియమాలకు విరుద్దమని సీఐఐ అధ్యక్షుడు మౌలానా మహ్మద్ ఖాన్ షీరానీ పేర్కొన్నారు.

ఈ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. భర్త రెండో పెళ్లికి మొదటి భార్య అంగీకారం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే రెండో పెళ్లికి మొదటి భార్య ఆమోదం కచ్చితంగా కావాలని 1961 నాటి ముస్లిం కుటుంబ చట్టం చెబుతోంది. ఇది ఇస్లామిక్ షరియా చట్టానికి విరుద్దంగా ఉందని షీరానీ పేర్కొన్నారు. షీరానీ సూచనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పురుషులు కూడా ఆయనపై విమర్శలు గుప్పించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement