
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి తగిన నేత ఎవరూ ?
రాష్ట్ర విభజన విషయంపై గురువారం హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కలిశారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంపై గురువారం హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేయాలని వారు దిగ్విజయ్ ను కోరారు. అసెంబ్లీ సెగ్మంట్లను 119 నుంచి 153 వరకు పెంచాలని చెప్పారు. ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపులో.. డీసీసీ అధ్యక్ష నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ కమిటీ ఆధ్యక్షులు డిమాండ్ చేశారు.
దాంతో దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి తగిన నేత ఎవరంటూ డీసీసీ అధ్యక్షులను ఆరా తీసినట్టు తెలిసింది. దానికి తెలంగాణ డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక తెలంగాణ కోసం నిజాయితీగా పనిచేసిన కాంగ్రెస్ నేతకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ ను కోరినట్టు సమాచారం.