10 జిల్లాలతో కూడిన తెలంగాణనే కావాలి: కోదండరాం | We want 10 districts Telangana, says Kodandaram | Sakshi
Sakshi News home page

10 జిల్లాలతో కూడిన తెలంగాణనే కావాలి: కోదండరాం

Dec 4 2013 11:58 AM | Updated on Jul 29 2019 2:51 PM

10 జిల్లాలతో కూడిన తెలంగాణనే కావాలి: కోదండరాం - Sakshi

10 జిల్లాలతో కూడిన తెలంగాణనే కావాలి: కోదండరాం

రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ప్రజల మధ్య ఐక్యత లోపిస్తుందని టి.జేఏసీ కన్వీనర్ ఫ్రొ.కోదండరాం అభిప్రాయపడ్డారు.

రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ప్రజల మధ్య ఐక్యత లోపిస్తుందని టి.జేఏసీ కన్వీనర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రాయలసీమలోని రెండు జిల్లాలను విడగొడితే అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  టి.జేఏసీ స్టీరింగ్ కమిటీ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ, రాయల తెలంగాణ అంశంపై చర్చించింది.

ఆ కమిటీ భేటీ అనంతరం కోదండరాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...తమకు 10 జిల్లాల సంపూర్ణ తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక జిల్లా ఎక్కువా వద్దు, ఒక జిల్లా తక్కువా వద్దని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ... రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినట్లు టీజేఏసీ నేత కోదండరాం ఈ సందర్బంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement