ఒక్క పిజాకు లక్ష రూపాయల టిప్! | US man delivers one pizza gets $2084 tip | Sakshi
Sakshi News home page

ఒక్క పిజాకు లక్ష రూపాయల టిప్!

Jan 19 2015 5:30 PM | Updated on Sep 2 2017 7:55 PM

ఒక్క పిజాకు లక్ష రూపాయల టిప్!

ఒక్క పిజాకు లక్ష రూపాయల టిప్!

డెలివరీ బాయ్ మీ ఇంటికి పిజా తెచ్చి ఇచ్చాడనుకోండి అతడికి ఎంత టిప్ ఇస్తారు.

మిచిగాన్: డెలివరీ బాయ్ మీ ఇంటికి పిజా తెచ్చి ఇచ్చాడనుకోండి అతడికి ఎంత టిప్ ఇస్తారు. మహాయితే పదో రూపాయిలు టిప్ కింద ఇస్తారు. మీ హృదయ వైశాల్యం విశాలమయితే ఇంకాస్త ఎక్కువ ఇచ్చి ఉదారత చాటుకుంటారు. లక్ష రూపాయలు టిప్ కింద ఇచ్చిన వారి గురించి మీరేప్పుడైనా విన్నారా. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

అమెరికాలోని మిచిగాన్ లో ఒక పిజా డెలివరీ చేసినందుకు రాబ్ అనే వ్యక్తికి 2,084 డాలర్లు(సుమారు రూ.1.28 లక్షలు) టిప్ దక్కింది. ఊహించని మొత్తంలో టిప్ దక్కడంతో రాబ్ అవాక్కయ్యాడు. కెల్లర్ విలియమ్స్ రియాల్టీ ఏజెంట్లు ఈ మొత్తం ఇచ్చారు. అన్నా ఆర్బొర్ లో సమావేశం జరుగుతుండగా రాబ్.. పిజా డెలివరీ చేశాడు. తన ఉద్యోగమే తనకు అదృష్టం తెచ్చిపెట్టిందని రాబ్ పొంగిపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement