మనోళ్లకు గ్రీన్‌ ఆస్కార్‌ అవార్డులు | Two Indians win 'Green Oscars' for conservation projects | Sakshi
Sakshi News home page

మనోళ్లకు గ్రీన్‌ ఆస్కార్‌ అవార్డులు

May 18 2017 5:09 PM | Updated on Sep 5 2017 11:27 AM

భారతదేశంలో జంతువులు, పక్షుల పరిరక్షణకు విశేష కృషికి గాను సంజయ్‌ గుబ్బి, పూర్ణిమ బర్మన్‌కు ప్రతిష్టాత్మక విట్లే అవార్డులు దక్కాయి.

లండన్‌: భారతదేశంలో జంతువులు, పక్షుల పరిరక్షణకు విశేష కృషికి గాను సంజయ్‌ గుబ్బి, పూర్ణిమ బర్మన్‌కు ప్రతిష్టాత్మక విట్లే అవార్డులు(గ్రీన్‌ ఆస్కార్స్‌) దక్కాయి.  2012 నుంచి కర్ణాటక ప్రభుత్వంతో కలసి పులుల రక్షణకు సంజయ్‌ పాటుపడుతుండగా, స్థానిక మహిళలతో కలసి అస్సాంలోని చిత్తడి నేలల్లో నివసించే బెగ్గురు కొంగను పూర్ణిమ కాపాడుతున్నారు. ఈ అవార్డు కింద విజేతలిద్దరికి రూ.29 లక్షలు దక్కనున్నాయి.

ఈ అవార్డు గెలుచుకోవటం ప్రతి జంతు పరిరక్షకుల కలని, గెల్చుకున్న ప్రైజ్‌మనీతో తమ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని పూర్ణిమ అన్నారు. అలాగే సంజయ్‌ మాట్లాడుతూ రెండు పులుల కారిడార్లలో చెట్లను పెంచేందుకు గాను, స్థానిక మహిళలకు గ్యాస్‌ స్టవ్‌లు ఇచ్చేందుకు ప్రైజ్‌మనీని వినియోగిస్తామని తెలిపారు. ఈ అవార్డును లండన్‌లోని రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీలో గురువారం బహూకరించనున్నారు. ఈ అవార్డును 1994 నుంచి విట్లే ఫండ్‌ ఫర్‌ నేచర్‌ సంస్థ ఇస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement