బిలావల్.. భలే జోక్ పేల్చావోయ్! | Twitter world reacted to Bilawal Bhutto Zardari's Kashmir comment | Sakshi
Sakshi News home page

బిలావల్.. భలే జోక్ పేల్చావోయ్!

Sep 21 2014 12:02 PM | Updated on Sep 2 2017 1:44 PM

బిలావల్.. భలే జోక్ పేల్చావోయ్!

బిలావల్.. భలే జోక్ పేల్చావోయ్!

పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ చేసిన కవ్వింపు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు చురక అంటించారు.

పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ పైచేసిన కవ్వింపు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు చురక అంటించారు. బిలావల్ కామెంట్లపై జోకులు పేల్చారు.

వారు మనల్ని ఆయుధాలతో చంపకపోతే... కచ్చితంగా జోక్స్ తో చంపేస్తారంటూ ఓ నెటిజన్ హాస్యమాడారు. బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్ కూడా ఒక జోక్ చెప్పారు. ఇదీ రావల్ చెప్పిన జోక్..

ప్రశ్న: చంద్రమామపై ఒక పాకిస్థానీ ఉంటే?
జవాబు: సమస్య

ప్రశ్న: చంద్రమామపై పది మంది పాకిస్థానీలు ఉంటే?
జవాబు: సమస్య

ప్రశ్న: చంద్రమామపై అందరూ పాకిస్థానీలు ఉంటే?
జవాబు: సమస్య పరిష్కారం
 

తాను ఇంతకుముందు విన్న జోకుల కంటే బిలావల్ చెప్పిన జోకే తనను ఎక్కువగా నవ్వించిందని జెమిన్ పంచాల్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. కాశ్మీర్ పై వ్యాఖ్యలతో బిలావల్... బిలో- ఆలో భుట్టో అయ్యారని మరో నెటిజన్ చురక అంటించారు. బిలావల్ ప్రకటనతో పీపీపీ- పాకిస్థాన్ పప్పు పార్టీగా నిర్థారణయిందని మరొకరు ట్వీట్ చేశారు.

కాశ్మీర్ ను లాక్కునే సత్తా ఉంటే బిలావల్ ముందుగా తన మెదడుకు పదును పెట్టిలని మరో యూజర్ సలహాయిచ్చారు. యావత్ కాశ్మీర్‌ను బిలావల్ తీసుకున్నా అందులోనూ తండ్రికి 10 శాతం వాటా ఇవ్వాలని ఒకరు చురకలంటించారు. కాగా, బిలావల్ వ్యాఖ్యలను అపరిపక్వమైనవిగా, చిన్నపిల్లాడి మాటలుగా బీజేపీ అభివర్ణించింది.

Advertisement
 
Advertisement
Advertisement