తిరుగుబాటుదారులను అణచివేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మరో 10వేల మంది సివిల్ సర్వీసు అధికారులను టర్కీ ప్రభుత్వం తొలగించింది.
10వేల మంది సివిల్ సర్వెంట్లపై వేటు
Oct 31 2016 11:04 AM | Updated on Sep 4 2017 6:48 PM
తిరుగుబాటుదారులను అణచివేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మరో 10వేల మంది సివిల్ సర్వీసు అధికారులను టర్కీ ప్రభుత్వం తొలగించింది. తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే నెపంతో 15కు పైగా మీడియా సంస్థలపై వేటు వేసింది. అమెరికాలో ఉంటున్న తమ మతగురువు ఫతుల్లా గులెన్ అనుచరులే ఈ తిరుగుబాటుకు కారణమని టర్కీ ఆరోపిస్తోంది. రాజ్యాంగ సవరణ చేసిన మరణశిక్షను మళ్లీ తీసుకురావాలని టర్కీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా యూరప్ మండలి ఆ దేశాన్ని హెచ్చరించింది. మరణశిక్షను అమలుచేయడం యూరప్ మండలికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.
యూరప్ మండలి హెచ్చరికలతో టర్కీ మళ్లీ ప్రభుత్వాధికారులపై వేటు వేయడం ప్రారంభించింది. 47 సభ్యుల సంస్థగా ఏర్పడిన యూరప్ మండలిలో, టర్కీ కూడా భాగస్వామ్యమే. యూరోపియన్ యూనియన్ ఆదేశాలతో 2004లో టర్కీలో మరణశిక్షలను నిషేధించారు. ఇప్పటికే టర్కీలో నెలకొన్న సైనిక తిరుగుబాటు నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం లక్షమంది ప్రభుత్వాధికారులపై వేటు వేసింది. 37వేల మందిని అరెస్టు చేసింది. తొలగించిన వారిలో వేలకు పైగా సివిల్ సర్వీసెస్ అధికారులు, పోలీసులు, న్యాయమూర్తులు, టీచర్లు, సైనికులు. ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు. విచారణ నిమిత్తం వారందరిన్నీ ఆ దేశ ప్రభుత్వం నిర్భందంలో ఉంచింది. వీరిని అరెస్టు చేయడం లేదా తొలగించడంపై అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్నాయి.
Advertisement
Advertisement