ముఖ్యమంత్రి ఓటమి ఖాయం | tpcc slams kcr survey | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి ఓటమి ఖాయం

May 28 2017 2:37 PM | Updated on Aug 14 2018 11:02 AM

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఓటమి తప్పదని ప్రతిపక్షం పేర్కొంది.

- గజ్వేల్‌లో కేసీఆర్‌ ఓడిస్తామన్న కాంగ్రెస్‌
- టీఆర్‌ఎస్‌ సర్వేపై నేతల ఘాటు విమర్శలు


హైదరాబాద్‌:
సర్వేల పేరుతో కేసీఆర్‌ గారడీలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి ఓటమి ఖాయమని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ విమర్శించింది. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల పనితీరుపై నిర్వహించిన సర్వే పూర్తిగా బోగస్‌అని పేర్కొంది.  

‘2019 ఎన్నికల్లో 111 స్థానాలు టీఆర్‌ఎస్‌వే’  అన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనపై ప్రతిపక్షం భగ్గుమంది. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్యనేతలు మీడియాతో మాట్లాడారు.

అంతా బోగస్‌: షబ్బీర్‌ అలీ
‘కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌కు పొయినసారి 48 శాతం మార్కులోస్తే, ఇప్పుడు 91 శాతం వచ్చినట్లు చెప్పారు. అలా ఎలా సాధ్యమైంది? సరే, ఆయన(సీఎం) అన్నట్లు పరిపాలన అంత బాగుంటే ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లొచ్చుకదా? బోగస్‌ సర్వేలతో గారడి చేసుడెందుకు?’

ఆ ముగ్గురే గెలుస్తారు: కోమటిరెడ్డి
‘వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 111 స్థానాలుకాదు, మూడంటే మూడే స్థానాలు గెలుస్తుంది. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు తప్ప ఏ ఒక్కరికీ డిపాజిట్లు దక్కవు. నిజంగా టీఆర్‌ఎస్‌కు దమ్ముంటే నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలి. ఒక వేళ గుత్తా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా’

గజ్వేల్‌లో కేసీఆర్‌ ఓడిపోతారు: జీవన్‌రెడ్డి
సర్వేల పేరుతో కేసీఆర్‌ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీమారినవాళ్లతో రాజీనామాలు చేయించాలి. అప్పుడే ప్రజలు ఎవరివైపు ఉన్నరో తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో ముఖ్యమంత్రి ఓటమి ఖాయం’
(ఉత్తమ్‌ ఓడిపోతారు.. మోదీ హవా ఉండదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement