
నేడు లెజండరీ బ్లడ్ డొనేషన్: ఎన్టీఆర్ ట్రస్ట్
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం ‘లెజండరీ బ్లడ్ డొనేషన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు...
సాక్షి,హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం ‘లెజండరీ బ్లడ్ డొనేషన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో టి.విష్ణువర్ధన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ సభ్యులు నారా భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అలాగే ‘తెలుగు వారి జ్ఞాపకం’ పేరుతో నిర్వహించే ఎన్టీఆర్ సినీ, రాజకీయ విశేషాలకు సంబంధించిన ప్రదర్శన కార్యక్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు.