'అయినా.. కలాం రాకెట్ సైంటిస్టే' | 'Though a rocket scientist Kalam was grounded to reality' | Sakshi
Sakshi News home page

'అయినా.. కలాం రాకెట్ సైంటిస్టే'

Jul 28 2015 1:03 PM | Updated on Aug 20 2018 3:02 PM

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఒక అంతర్జిక్ష శాస్త్రవేత్త(రాకెట్ సైంటిస్ట్)గా డీఎమ్కే పార్టీ నేత ఎమ్.కె స్టాలిన్ అభివర్ణించారు.

చెన్నై: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఒక అంతర్జిక్ష శాస్త్రవేత్త(రాకెట్ సైంటిస్ట్)గా డీఎమ్కే పార్టీ నేత ఎమ్.కె స్టాలిన్ అభివర్ణించారు. కలాం ఒక అసమానమైన నిజాయితీ, నిరాడంబరత, మేధస్సు కలిగిన మానవతావాదిగా ఆయన కొనియాడారు. క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన కలాంను రాకెట్ సైంటిస్ట్' గా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలాం బోధించిన విషయాలు యువత, పిల్లల్లో ఎంతో స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతిఒక్కరూ తమ కలను సాకారం చేసుకునేలా తోడ్పడ్డాయని చెప్పారు.

ఇదిలా ఉండగా, డీఎమ్కే అధినేత ఎమ్. కరుణానిధి అబ్దుల్ కలాం గుండెపోటుతో మరణించారని తెలియగానే తాను ఒక్కసారిగా షాక్కు గురయ్యానని తెలిపారు. తనకు కలాంతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. కలాం కుటుంబ సభ్యులకు, ఆయన శ్రేయోభిలాషులకు, భారత యువత తరపునా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు కరుణానిధి సందేశమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement