శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ కూంబింగ్ | Task force police to Kumbing at Shesachalam forest | Sakshi
Sakshi News home page

శేషాచలం అడవుల్లో టాస్క్ఫోర్స్ కూంబింగ్

Sep 23 2015 10:24 PM | Updated on Sep 3 2017 9:51 AM

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో బుధవారం స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో బుధవారం స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. శ్రీవారి మెట్టు సమీపంలో ఎర్రగుట్ట వద్ద కూంబింగ్ నిర్వహించగా.. ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.

దాంతో ఎర్రచందనం కూలీలు పరారీ అయినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటన స్థలంలో 35 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.  అయితే కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement