ఆన్లైన్ లో వేధింపులు మామూలే! | Sakshi
Sakshi News home page

ఆన్లైన్ లో వేధింపులు మామూలే!

Published Thu, Oct 23 2014 3:23 PM

ఆన్లైన్ లో వేధింపులు మామూలే!

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఆన్లైన్ లో వేధింపులు సర్వసాధామణట. ఆన్లైన్ జీవితంలో వేధింపులు మామూలు విషయంగా మారిందని ఓ సర్వేలో వెల్లడైంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న అమెరికా పౌరుల్లో మూడో వంతు వేధింపులు బారిన పడినవారేనని ప్యు రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో తేలింది.

ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొన్నామని సర్వేలో 40 శాతం మంది తెలిపారు. శారీరక, లైంగిక వేధింపులకు గురైయ్యామని వెల్లడించారు. అయితే వీరిలో సగం మంది తమను ఎవరో వేధిస్తున్నారో తెలుసుకోలేకపోయారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు.

తమ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్ లో పెట్టినవారు, ఐటీ రంగంలో పనిచేసేవారు వేధింపులకు బాధితులవుతున్నారు. సెలబ్రిటీలకు ఆన్లైన్ వేధింపులు తప్పడం లేదని సర్వేలో వెల్లడైంది. హాలీవుడ్ తారలు జెనిఫర్ లారెన్స్, వెనిసా హడ్జన్స్, అప్టన్ తదితరుల నగ్న ఫొటోలను దొంగిలించి ఆన్ లైన్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement