దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభ మయ్యాయి.
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభ మయ్యాయి. సెన్సెక్స్ 41 పాయింట్ల లాభంతో 30,791 వద్ద,నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 9511 వద్ద ట్రేడ్అవుతోంది. ముఖ్యంగా ఆయిల్ గ్యాస్ సెక్టార్ టాప్ లూజర్‌గాఉంది. వచ్చే ఏడాది(2018) మార్చివరకూ ఉత్పత్తిని నియంత్రించేందుకు ఒపెక్ దేశాలు గురువారంనాటి సమావేశంలో అంగీకరించినప్పటికీ ముడిచమురు ధరలు పతనం దిశగా పయనిస్తున్నాయి. ఐటీ బలహీనంగా, ఫార్మా, మెటల్, పాజిటివ్‌గా ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ , డా. రెడ్డీస్, అరబిందో, టాటా స్టీల్, మారుతి సుజుకి, టీవీఎస్ మోటార్ లాభాల్లో ఉన్నాయి. సిప్లా, బీపీసీఎల్, ఐఓసీ టెక్ మహీంద్రచ భారతి ఎయిర్ టెల్ నష్టాల్లోఉన్నాయి.