మూలకణ చికిత్సతోవినికిడి శక్తి... | Stem cells can restore hearing ability | Sakshi
Sakshi News home page

మూలకణ చికిత్సతోవినికిడి శక్తి...

Jun 22 2014 12:43 AM | Updated on Sep 2 2017 9:10 AM

లోపలి చెవిలో సమస్య కారణంగా వినికిడి లోపంతో బాధపడుతున్న రోగులకు ఇకపై మూలకణ చికిత్సతో తిరిగి వినికిడి శక్తిని పునరుద్ధరించవచ్చు.

న్యూయార్క్: లోపలి చెవిలో సమస్య కారణంగా వినికిడి లోపంతో బాధపడుతున్న రోగులకు ఇకపై మూలకణ చికిత్సతో తిరిగి వినికిడి శక్తిని పునరుద్ధరించవచ్చు. చెవిలోని కాక్లియా నుంచి శబ్దాన్ని మెదడుకు చేరవేసే స్పైరల్ గాంగ్లియన్ అనే నాడీకణాల క్షీణత వల్ల చాలా మంది వినికిడి జ్ఞానాన్ని కోల్పోతుంటారు. పరిణతి చెందిన ఈ నాడీకణాలను తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాకపోవడంతో చాలామంది చెవిటివారిగానే మిగులుతున్నారు. అయితే మూలకణాల ద్వారా పరిణతి చెందిన గాంగ్లియన్ నాడీకణాలను సైతం తిరిగి ఉత్పత్తి చేయవచ్చని ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో తాజాగా స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని కృత్రిమంగా ప్రయోగశాలలో పునరుత్పత్తి చేయవచ్చని తేలిన నేపథ్యంలో భవిష్యత్తులో లోపలిచెవిలోని నాడీకణాల మార్పిడికి మార్గం సుగమం కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement