కొత్త ఐఫోన్7పై భలే డిస్కౌంట్! | Snapdeal Sale Offers Include Rs. 7,000 Discount on iPhone 7 and More | Sakshi
Sakshi News home page

కొత్త ఐఫోన్7పై భలే డిస్కౌంట్!

Oct 21 2016 12:09 PM | Updated on Sep 4 2017 5:54 PM

కొత్త ఐఫోన్7పై భలే డిస్కౌంట్!

కొత్త ఐఫోన్7పై భలే డిస్కౌంట్!

పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ నిర్వహిస్తున్న అన్బాక్స్ సేల్ ఆఫర్లో చివరి రోజు కొత్త ఆపిల్ ఐఫోన్7పై స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది.

పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ నిర్వహిస్తున్న అన్బాక్స్ సేల్ ఆఫర్లో చివరి రోజు కొత్త ఆపిల్ ఐఫోన్7పై స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. ధరపై రూ.7,000ల డిస్కౌంట్ అందిస్తున్నట్టు స్నాప్డీల్ పేర్కొంది. అయితే ఈ డిస్కౌంట్ కేవలం యస్ బ్యాంకు కార్డు హోల్డర్స్కేనని, నేటి మధ్యాహ్నం 12 గంటల వరకు లేదా స్టాక్స్ అయిపోయేంత వరకు ఈ ఆఫర్ వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నట్టు స్నాప్డీల్ తెలిపింది. అంతేకాక ఈ డిస్కౌంట్ ఐఫోన్7 యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ఎవరైతే ఐఫోన్7 ప్లస్ కొనుకోవాలనుకుంటున్నారో వారికి ఈ ఆఫర్ను స్నాప్డీల్ ప్రకటించలేదు.ఈ ఆఫర్ కింద ఇతర మోడల్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకుని ఐఫోన్7ను కొనుగోలు చేసే వారికి రూ.20వేల వరకు ధర తగ్గించనుంది. అయితే వినియోగదారులు ఎక్స్చేంజ్ చేసుకునే  మోడల్ బట్టి ఈ ఆఫర్ అందించనున్నట్టు తెలిపింది.      
 
గతవారం నిర్వహించిన మొదటి అన్బాక్స్ దివాళి సేల్ కింద ఇదేమాదిరి ఆఫర్ను స్నాప్డీల్ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్స్పై ఫ్లాట్పై రూ.10,000ల డిస్కౌంట్ ఇచ్చింది. అయితే ఎలాంటి నోటీసులు లేకుండా అప్పుడు ఆ ఆఫర్ను స్నాప్డీల్ వెనక్కి తీసుకోవడంపై వినియోగదారులు నిరాశ చెందారు. నిరాశ పొందిన కస్టమర్ల కోసం మరోసారి ఈ ఆఫర్ను తీసుకొచ్చింది. ఐఫోన్ 7 ఆఫర్తో పాటు, హెచ్డీఎఫ్సీ కార్డు హోల్డర్లతోనూ  స్నాప్డీల్ జతకట్టింది. తమ ప్లాట్ఫామ్పై హెచ్డీఎఫ్సీ కార్డుపై ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారికి 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అదేవిధంగాఎక్స్చేంజ్ ఆఫర్లను, ఆపిల్ ఐఫోన్ 6ఎస్, లీఎకో లీ మ్యాక్స్ 2, శాంసంగ్ గెలాక్సీ జే3 వంటి ఇతర స్మార్ట్ఫోన్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను స్నాప్డీల్ వినియోగదారుల ముంగిట్లోకి తీసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement