వెంటపడి మరీ పోలీసుల భరతం పట్టారు | slum people beats Police | Sakshi
Sakshi News home page

వెంటపడి మరీ పోలీసుల భరతం పట్టారు

Jun 12 2015 11:36 AM | Updated on Aug 21 2018 5:46 PM

వెంటపడి మరీ పోలీసుల భరతం పట్టారు - Sakshi

వెంటపడి మరీ పోలీసుల భరతం పట్టారు

ఒడిశాలో పోలీసులపై స్థానికులు తిరుగుబాటు చేశారు. అన్యాయాన్ని సమర్ధించేలా వ్యవహరించిన పోలీసులను చితకబాదారు.

భువనేశ్వర్: ఒడిశాలో పోలీసులపై స్థానికులు తిరుగుబాటు చేశారు. అన్యాయాన్ని సమర్ధించేలా వ్యవహరించిన పోలీసులను చితకబాదారు. భువనేశ్వర్‌ జిల్లా లక్ష్మీ సాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హల్దీపదా స్లమ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంతోష్ జెనా అనే వ్యక్తి తన భార్య బతికుండగానే హల్దీపదా అనే స్లమ్ ఏరియాకు చెందిన బాలికతో లోబరుచుకొని చేసి ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం నిరాకరించాడు.

దీంతో ఆమె తల్లిదండ్రులు లక్ష్మీ సాగర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించినా న్యాయం జరగలేదు. పోలీసులు కనీసం ఎఫ్ ఐఆర్ ను కూడా నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు సంతోష్ జెనాను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. అతడిని కాపాడేందుకు లక్ష్మీసాగర్ ఇన్‌స్పెక్టర్ రజత్ రాయ్, సబ్ ఇన్‌స్పెక్టర్ అశోక్ హన్స్‌దా తదితరులు అక్కడికి రావడంతో అప్పటికే ఖాకీలపై ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు పోలీసులపై  తిరుగుబాటు చేశారు. వచ్చిన పోలీసులను వచ్చినట్లే చితకబాదారు. గ్రామస్థులంతా ఏకమై తమ ఆక్రోశాన్ని చూపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement