ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు, ఎంపీలు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు, ఎంపీలు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ విందుకు శివసేన ఎంపీలు హాజరయ్యారు. అయితే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విందుకు దూరంగా ఉన్నారు.
ఈ సందర్భంగా తమ ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతల గురించి ఎంపీలతో ప్రధాని మోదీ పంచుకోనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, ఎంపీ మోడల్ విలేజ్ పథకాలను గురించి వివరించనున్నారని కేంద్ర ప్రచార, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అంతకుముందు తెలిపారు. ఆయా పథకాలపై సంబంధింత మంత్రులు ప్రజెంటేషన్ ఇస్తారని వెల్లడించారు. ఈ పథకాలను విజయవంతం చేయాలని ఎంపీలను మోదీ కోరనున్నారు.