షీనా హత్య కేసులో ఊహించని మలుపులెన్నో! | Sheena Bora Was Dating My Son, Says TV Mogul Peter Mukerjea | Sakshi
Sakshi News home page

షీనా హత్య కేసులో ఊహించని మలుపులెన్నో!

Aug 26 2015 7:08 PM | Updated on Sep 3 2017 8:10 AM

షీనా బోరా (ఫైల్)

షీనా బోరా (ఫైల్)

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న న్యూస్ ఎక్స్ సహ వ్యవస్థాపకురాలు ఇంద్రాణి ముఖర్జియా లీలలు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి. నాటకీయ ఫక్కీలో పోలీసులు ఈ కేసును ఛేదించారు.

అక్రమ ఆయుధాల కేసులో పట్టుబడిన ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ మనోహర్ పోలీసుల విచారణలో నోరు విప్పడంతో గుట్టు రట్టైంది. సొంత కూతురైన షీనా బోరానిని ఇంద్రాణి హత్య చేయించినట్టు అతడు వెల్లడించాడు.

షీనా బోరానిని మొదట ఇంద్రాణి చెల్లెలు భావించారు. అయితే తర్వాత వాస్తవం వెల్లడైంది. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియాను ఇంద్రాణి రెండో వివాహం చేసుకుంది. అప్పటికే పీటర్ కు ఇద్దరు కొడుకులు, ఇంద్రాణికి కొడుకు, కూతురు ఉన్నారు.

రెండో పెళ్లి సమయంలో కూతురు షీనాను చెల్లెలిగా భర్తకు ఇంద్రాణి పరిచయం చేసింది. వరస తెలియకుండా షీనాతో పీటర్ రెండో కుమారుడు ప్రేమవ్యవహారం నడిపాడు. ఈ విషయం ఇంద్రాణి తెలియడంతో డ్రైవర్ తో షీనాను హత్య చేయింది. ఎవరికీ అనుమానం రాకుండా షీనాను అమెరికా పంపించినట్టు నమ్మబలుకుతూ వచ్చింది. చివరకు గుట్టు రట్టు కావడంతో జైలు పాలైంది. ఇంద్రాణి మొదటి భర్త సంజీవ్ కన్నాను కూడా పోలీసులు కోల్ కతాలో అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement